AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Revised Exam Dates: నిరుద్యోగులకు అలర్ట్‌.. రైల్వే పరీక్షల తేదీలు మళ్లీ మారాయ్‌..! కొత్త షెడ్యూల్ ఇదే

రైల్వే ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి రైల్వే మంత్రిత్వ శాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. గతంలో ఇచ్చిన పరీక్ష తేదీలను మారుస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా కొత్త పరీక్ష తేదీలను జారీ చేసింది..

RRB Revised Exam Dates: నిరుద్యోగులకు అలర్ట్‌.. రైల్వే పరీక్షల తేదీలు మళ్లీ మారాయ్‌..! కొత్త షెడ్యూల్ ఇదే
RRB Revised Exam Dates
Srilakshmi C
|

Updated on: Nov 22, 2024 | 4:40 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 22: ఇటీవల కేంద్ర రైల్వే శాఖ వివిధ ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తైంది. త్వరలోనే రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ పరీక్ష తేదీలను మరోమారు మారుస్తూ ప్రకటన జారీ చేసింది. రైల్వే ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు తెలియజేస్తే ఈ మేరకు ప్రకటనను జారీ చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి నవంబర్‌ 1న పరీక్ష తేదీలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా అందులో మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది. పరీక్ష తేదీలు కాస్త అటుఇటుగా మార్పు చేశారు. మొత్తానికి ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే జరుగనున్నాయని స్పష్టం చేసింది. ఆయా పరీక్షలకు 10 రోజుల ముందుగా ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు విడుదల చేస్తారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఈ సందర్భంగా సూచించింది. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు.. తమతోపాటు హాల్‌టికెట్‌ను,ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది.

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులు, 14298 టెక్నీషియన్‌ పోస్టులు, 7951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకికి సంబంధించిన పరీక్షల తేదీలను ఈ కింది షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించనున్నారు. ఇక ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. కంప్యూటర్‌ ఆధారంగా ఈ పరీక్షలన్నీ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఇదే..

  • అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) పోస్టులకు నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
  • ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులకు డిసెంబర్‌ 2, 3, 9, 12, 13 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
  • టెక్నీషియన్ (గ్రేడ్‌-1, 3) పోస్టులకు డిసెంబర్‌ 19, 20, 23, 24, 26, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
  • జూనియర్ ఇంజినీర్ పోస్టులకు డిసెంబర్‌ 16, 17, 18 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్