చక్కెర నోటిలో బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. ఇది మరింత కావిటీస్, దంత క్షయానికి దారితీస్తుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది. మీ గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు రావడం మూడ్ స్వింగ్స్‌కు కారణం అవుతుంది. అంటే మూడీగా, ఆత్రుతగా లేదా చిరాకుగా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ చక్కెర తినడం వల్ల స్వీట్లను ఎక్కువగా తినాలని అనిపిస్తుంది.