- Telugu News Photo Gallery Brain Stroke Symptoms and Prevention: Early Stroke Prediction Methods for Prevention of Strokes
Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కనించే లక్షణాలు ఇవే.. ఇవి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే
జీవనశైలి వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఇది రావడానికి ముందు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 21, 2024 | 8:56 PM

మెదడులోని ఒక భాగంలో రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీని లక్షణాలను ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో సంభవిస్తున్న అధిక మరణాల్లో స్ట్రోక్ ప్రధాన కారణం.

ప్రతి సంవత్సరం 795,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లు స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. మెదడు కణాలు, కణజాలం దెబ్బతినడం వల్ల నిమిషాల్లో మరణిస్తున్నారు. అందువల్ల స్ట్రోక్ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. మెదడులో రక్తం సరఫరా సరిగా లేకపోవడం వల్ల కణజాలం, కణాలు దెబ్బతింటాయి. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

దీని వల్ల శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. స్ట్రోక్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఎంత త్వరగా చికిత్స అందిస్తే, అంత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల నరాల వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటిల్లో మైగ్రేన్లు, స్ట్రోక్స్, మూర్ఛలు, అనేక రకాల క్యాన్సర్లు, మెదడు కణితులు వంటివి వస్తున్నాయి. నేటి కాలంలో ఇవి చాలా సాధారణమైపోయాయి. ప్రతి సంవత్సరం 40 నుండి 50 వేల మంది బ్రెయిన్ ట్యూమర్‌తో మరణిస్తున్నారు.

భారతదేశంలోని యువతలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 5 సంవత్సరాలలో 25 శాతం పెరిగాయి. చాలా కేసులు 25-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో సంభవిస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వైపు మాత్రమే కాకుండా షుగర్, హై బీపీ వంటి జీవనశైలి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. నిద్రలేమి, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. వాయు కాలుష్యం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయి.

తలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. అలాగే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ధూమపానం, ఒత్తిడిని నివారించాలి. సాధారణ వ్యాయామం కూడా చాలా అవసరం. వ్యాయామం, నడక మధుమేహం, ఊబకాయం, హై బీపీ, డైస్లిపిడెమియా మొదలైన వ్యాధుల నుంచి కాపాడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నరాల సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్షా 85 వేలకు పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 40 సెకన్లకు ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నారు.




