కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది దీన్ని రోజూ తినడానికి ఇష్టపడతారు. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు ఎ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.