Viral Video: వామ్మో.. బామ్మోయ్! గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన 85 ఏళ్ల బామ్మ.. ఫొటోలు చూశారా?
ఏ వయసుగా ముచ్చట అనేది పాత సామెత. అయితే వయసుకి, అందానికి ఈ బామ్మ కొత్త ముచ్చట చెబుతుంది. అంతే.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయింది. 85 యేళ్ల వయసులో ఫ్యాషన్ ప్రియులకు ఐకానిక్ స్టార్ గా మారిందీ బామ్మ..
టీనేజ్ యువత దృష్టంతా ఉంటే చదువు మీద ఉంటుంది. లేదంటే బ్యూటీపై ఉంటుంది. అదే పాతికేళ్లకు కెరీర్‌పై ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సంసార జంజాటంలో కొట్టుకుపోతారు. ఇక అరవై యేళ్లు వచ్చేటప్పటికీ కృష్ణా.. రామా.. అంటూ ఓ మూలన చేరి శేష జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఓ 80 యేళ్ల బామ్మ మాత్రం నాకేమంత వయసై పోయింది..? అంటూ గారాలు పోతుంది. అంతేనా.. సినిమా హీరోయిన్లకు ధీటుగా కొత్త కొత్తగా.. ఫ్యాషన్ ఐకాన్‌గా రోజురోజుకీ మారిపోతుంది. ఈ బామ్మ స్టైల్‌ని చూస్తే వందేళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గకూడదు.. అనిపించేస్తుంది.
జాంబియాకు చెందిన మార్గరెట్ చోలా.. అనే 85 ఏళ్ల వృద్ధురాలు ఊహించని రీతిలో గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చూస్తే.. వామ్మో బామ్మోయ్ అనేస్తారు. ‘లెజెండరీ గ్లామా’ హ్యాష్ ట్యాగ్‌తో ప్రతి రోజూ రకరకాల ఫ్యాషనబుల్ వస్త్రా ధారణలో చమటలు పట్టించేస్తుంది. మార్గరెట్ చోలా బామ్మకు 1,05,000 మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. భారీ సన్ గ్లాసెస్ నుంచి రకరకాల ఆభరణాల వరకు లెటెస్ట్ స్టైల్‌లో దుస్తులను ధరించి.. ఫొటోలకు ఫోజులిస్తుంది. ఆనక వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడం బామ్మ దినచర్య. ఆమె సృజనాత్మక ఆలోచనను న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె మనవరాలు డయానా కౌంబాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. Ms చోల “గ్రానీ సిరీస్” పేరిట వెబ్ సిరీస్ తీసింది. దీంతో బామ్మ డ్రెస్-అప్ సెషన్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
2024 ఏప్రిల్‌లో తొలిసారి కౌంబా.. తన బామ్మ షో-స్టాపింగ్ ఫోటో సిరీస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి కథ మలుపు తిరిగింది. అది కాస్తా ఊహించని రీతిలో వైరల్‌గా మారడంతో.. రోజుకో స్టైల్‌లో విచిత్రమైన కాంబినేషన్‌లో డ్రెస్‌లు, ఆర్నమెంట్స్‌తో బామ్మను అలంకరించి ఫొటో షూట్ చేయడం ప్రారంభించింది మనవరాలు డయానా కౌంబా. గ్రానీ సిరీస్ ద్వారా 70-96 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుల జీవితాలు సమాజం ద్వారా తీర్పు తీర్చబడుతుందని చింతించకుండా.. వారికి నచ్చినట్లు జీవించడానికి అవకాశం ఇవ్వాలనే సందేశం ఇచ్చారు. మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ గతాన్ని ఎప్పటికీ మార్చలేరు. కానీ మీరు మీ భవిష్యత్తును మార్చగలరు అని మిస్ గ్రానీ చెబుతున్నారు. ‘గ్రానీ సిరీస్’ సక్సెస్ అవ్వడంతో అది కూడా కొత్త ట్రెండ్‌కు దారితీసింది. కాగా మార్గరెట్ చోలాకు నలుగురు మనుమరాలు.