AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తలకొరివి పెడుతుండగా చితిపై నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ! బిత్తరపోయిన బంధువులు.. వీడియో

ఓ వృద్ధురాలు చనిపోవాలని భావించి పురుగుల మందు తాగేసింది. గమనించిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో చేసేదిలేక ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అంతా స్మశానానికి కూడా చేర్చుకున్నారు. అప్పుడే ఆకస్మాత్తుగా అనుకోని అద్భుతం జరిగింది..

Viral Video: తలకొరివి పెడుతుండగా చితిపై నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ! బిత్తరపోయిన బంధువులు.. వీడియో
Burial
Srilakshmi C
|

Updated on: Nov 20, 2024 | 6:36 PM

Share

తిరుచ్చి, నవంబర్‌ 20: అనారోగ్యంతో మృతి చెందిన ఓ ముసలావిడను స్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టూ చేరిన అయినవాళ్లు, బంధుజనం చివరి సారిగా బామ్మను చూసుకుని, దుఃఖిస్తున్నారు. ఇంతలో వారికళ్లను వారే నమ్మలేని విధంగా అద్భుతం జరిగింది. చితిపై చలనం లేకుండా పడుకుని ఉన్న భామ్మ కళ్లు తెరచి అమాంతం లేచి కూర్చుంది. దీంతో భయాందోళలనకు గురైన బంధువులు తొలుత ఆమె వద్దకు వెళ్లేందుకు కొంత సంశచించినా.. చివరకు ఆమె బతికే ఉందని నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన పంపైయ్యన్‌ (72), అతని భార్య చిన్నమ్మాల్‌ (62) దంపతులు. ఏం జరిగిందో తెలియదుగానీ నవంబర్‌ 16న చిన్నమ్మాల్‌ పురుగుల మందుతాగింది. దీంతో గమనించిన స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. చిన్నమ్మాల్‌ మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో బంధువులు ఆమె అంత్యక్రియలకు బంధువులు, ఇరుగుపొరుగు వారు తరలివచ్చారు. ఎమ్‌ మెట్టుపట్టిలోని స్మశాన వాటికలో చిన్నమ్మాల్‌ దహన సంస్కారాలకు వందలాది మంది బంధువులు, ఊరి జనాలు తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

చితిపై చిన్నమ్మాల్‌ శరీరాన్ని ఉంచి, మరి కాసేపట్లో దహనం చేయబోతుండగా.. ఉన్నట్లుండి ఆమె కదలడం ప్రారంభించింది. అనంతరం ఆమె కళ్లు తెరచి తనపై పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె బతికే ఉందని నిర్ధారణ కావడంతో అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను చికిత్స కోసం తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (MGMGH) కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని తిరుచ్చి పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.