ద్యావుడా ఎటు పోతున్నాం.. రీల్స్ లైక్స్ కోసం నడి రోడ్డుమీదనే బట్టలు మార్చుకున్న యువతి.. నెట్టింట వీడియో వైరల్..

ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ట్రాక్ సూట్ ధరించిన ఈ అమ్మాయి ఓపెన్ రెస్టారెంట్ దగ్గర ఆగి.. రోడ్డుపైనే బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసి చుట్టుపక్కల ఉన్నవారందరూ ఆశ్చర్యపోయి ఆమె వైపు చూడటం ప్రారంభించారు. ఈ వీడియో ఉద్దేశ్యం ఏదైనా సరే .. సమాజంలో బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ముఖ్యం. ఎందుకంటే ఈ రకమైన కంటెంట్ సమాజంలో విపరీత ధోరణులను ప్రోత్సహిస్తుంది

ద్యావుడా ఎటు పోతున్నాం.. రీల్స్ లైక్స్ కోసం నడి రోడ్డుమీదనే బట్టలు మార్చుకున్న యువతి.. నెట్టింట వీడియో వైరల్..
Viral Video News
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2024 | 4:58 PM

సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నేటి యువత ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.. తాము ఎంత దూరం అయినా వెళ్తాం అని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. సామాజిక ప్రయోగం పేరుతో ఓ అమ్మాయి చేసిన పని ఇంటర్నెట్‌ జనాలను ఉలిక్కిపడేలా చేసింది. ట్రాక్ సూట్ ధరించి రోడ్డుమీద నడుస్తూ వచ్చిన ఓ అమ్మాయి సడెన్ గా ఆగి రోడ్డుపైనే బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారికి మొదట ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.. తర్వాత ఏమిటిది అంటూ షాక్ తిన్నారు. వైరల్ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్‌లో కూర్చున్న వ్యక్తులు ఆశ్చర్యపోయిన కళ్లతో బట్టలు మార్చుకుంటున్న అమ్మాయిని చూస్తున్నారు.

వైరల్ వీడియోలో కనిపించిన అమ్మాయి కంటెంట్ సృష్టికర్త అయిన ఏరిగా గుర్తించబడింది. Instagram @ary_bloomలో 4.5 లక్షల మంది ఈమెను అనుసరిస్తున్నారు. వీడియోలో ఏరి ట్రాక్ సూట్‌లో ఓ బ్యాగ్‌ని పట్టుకుని వీధిలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సమీపంలో ఒక ఓపెన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ కొంతమంది బీరు తాగుతూ కనిపిపిస్తున్నారు. ఈ వీడియో మరొక దేశానికి చెందినది, ఇక్కడ బహిరంగంగా మద్యం సేవించడం బహుశా చట్టవిరుద్ధం కానట్లు ఉంది. తర్వాత ఏరి రెస్టారెంట్ దగ్గరకు చేరుకోగానే.. ఆమె తన బ్యాగ్‌ను రోడ్డుపై ఉంచి బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్‌లో కూర్చున్న వ్యక్తులు ఏరీ చేసిన చర్యలకు ఆశ్చర్యపోతున్నారు. సామాజిక ప్రయోగం పేరుతో ఆమె తన అసంబద్ధ చర్యలను కొనసాగించి ట్రాక్ సూట్ కింద బ్లూ కలర్ కట్ గౌను కనిపించేలా ట్రాక్ సూట్ ని చకచకా విప్పెసినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ ప్రయోగం వెనుక ఉద్దేశ్యం ఏదైనా ఇలాంటి చేయడం సరికాదని అంటున్నారు.

ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ రకమైన కంటెంట్ సమాజంలో అసంబద్ధ ధోరణులను ప్రోత్సహిస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతుంది.

ఏరీ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో ఫన్నీ వ్యాఖ్యలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ఇంట్లో ఎవరూ పట్టించుకోక పొతే యువత యులాంటి చర్యలకు పాల్పడతారని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు చెప్పారు సోదరి ఇటువంటి ప్రవర్తన భారతదేశంలో కుదరదు అని కామెంట్ చేశారు. మరొకరు తెలివితక్కువ పనులు చేసి అది సామాజిక ప్రయోగం అంటే ఎలా అని.. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మూర్ఖత్వం పరిమితులను దాటుతోందని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!