AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antibiotic Overuse: చిన్న కారణాలతో యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా.. మీ మరణాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారని తెలుసా

అప్పుడెప్పుడో వెంకటేష్, రేవతి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్ దగ్గుకు, జలుబు, జ్వరం ఇలా రకరకాల వ్యాధుల పేరు చెప్పి.. టాబ్లెట్స్ ను పిప్పర్ మెంట్స్ లా మింగేస్తూ ఉంటుంది. చివరికి ఆ టాబ్లెట్స్ ప్రభావంతో ఎ మందులు పనిచేయక ప్రాణాలు కోల్పోతుంది. అది సినిమాలో పాత్ర నేటి జనరేషన్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో యాంటీబయాటిక్స్ వాడకం గణనీయంగా పెరిగింది. భారతదేశంలో కూడా ఈ మందుల వినియోగం పెరుగుతోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. దీంతో ప్రాణాపాయం బారిన పడుతున్నారు.

Antibiotic Overuse: చిన్న కారణాలతో యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా.. మీ మరణాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారని తెలుసా
Antibiotic OveruseImage Credit source: DEV IMAGES/Moment/Getty Images
Surya Kala
|

Updated on: Nov 20, 2024 | 4:36 PM

Share

యాంటిబయాటిక్స్‌ వాడకం పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఈ మందుల వాడకం గణనీయంగా పెరిగింది. మితిమీరిన వినియోగం ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుంది. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాకు నిరోధకత ఏర్పడుతుంది. దీంతో వ్యాధిపై మందులు ప్రభావం చూపించడం లేదు. దీంతో రోగులకు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యానికి యాంటీబయాటిక్స్ వాడకం ఎంత ప్రమాదకరం? ఎలా ప్రాణాంతకంగా మారుతున్నాయి? దీని గురించి నిపుణుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (IHBAS) ప్రొఫెసర్ డాక్టర్ సంగీతా శర్మ భారతదేశంలో యాంటీబయాటిక్స్ వాడకం విషయంపై మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో, తరువాత యాంటీబయాటిక్స్ వాడకం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ నుంచి యాంటీబయాటిక్స్ ను ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక రకాల యాంటీబయాటిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున.. ఎ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వీటిని కొనుగోలు చేస్తున్నారు. వైద్యుడిని సంప్రదించకుండా వాటిని వినియోగిస్తారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వలన కొన్ని రకాల మందులు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదు అంతేకాదు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. దీని వల్ల శరీరంలో చెడు బాక్టీరియా వ్యాపించి మంచి వాటిని అధిగమిస్తోంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

యాంటీబయాటిక్స్ ఎలా ప్రమాదకరంగా మారుతున్నాయంటే

యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారని డాక్టర్ సంగీత చెబుతున్నారు. కొంతమంది వైద్యులను సంప్రదించకుండా వాటిని సొంతంగా కొనుగోలు చేసి మరీ వాడుతున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఈ మందులకు వ్యతిరేకంగా బలంగా తయారవుతుంది. ఈ మందులకు వ్యతిరేకంగా ప్రతిఘటన బ్యాక్టీరియాలో అభివృద్ధి చెందుతుంది. అంటే బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ ప్రభావం ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఔషధం రోగికి ఇచ్చినప్పుడు.. అది ప్రభావితం చేయదు. అటువంటి పరిస్థితిలో చికిత్సకు ఎటువంటి ఉపయోగం ఉండు. దీంతో ఒకొక్కసారి రోగి మరణిస్తాడు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రజలకు అవగాహన కల్పించాలి

యాంటీబయాటిక్స్ అధికంగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ సంగీత అంటున్నారు. దీనితో పాటు యాంటీబయాటిక్స్ కౌంటర్లో విక్రయించడం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని అమ్మడంపై నిషేధం విధించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది అని చెబుతున్నారు.1403103,1403073,1403046,1403000

మరిని హెల్త్  సంభదిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..