New Year 2025: కొత్త ఏడాదిలో అడుగు పెట్టే లోపు ఈ ఐదు చర్యలు చేయండి.. శనీశ్వర అనుగ్రహంతో డబ్బు సమస్యలు దూరం..

ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆశలు,ఉత్సాహాన్ని తెస్తుంది. కొత్త సంవత్సరంలోనైనా అదృష్టం కలిసి వచ్చి తమకు అనుకూలంగా పనులు జరుగుతాయని.. సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు. అయితే ఎవరైనా కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసి రావాలనుకుంటే కొన్ని సులభమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆ నివారణ చర్యలతో జీవితం కొత్త ఏడాదిలో సరికొత్తగా మొదలు పెట్టవచ్చు.

New Year 2025: కొత్త ఏడాదిలో అడుగు పెట్టే లోపు ఈ ఐదు చర్యలు చేయండి.. శనీశ్వర అనుగ్రహంతో డబ్బు సమస్యలు దూరం..
Lord Shaniswara
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2024 | 4:05 PM

2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరం 2025కి వెల్కం చెప్పడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక శుభ, అశుభ ప్రభావాలు ఉన్నాయి. అయితే ప్రతిసారీ కొత్త సంవత్సరంపై ఎన్నో కొత్త ఆశలు నెలకొంటాయి. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కనుక ప్రతి వ్యక్తి కొత్త సంవత్సరంపై అనేక అంచనాలను కలిగి ఉంటారు. కొత్త సంవత్సరం అయినా తమకు అదృష్టం కలిసి వస్తుందా.. అనుకూలంగా ఉంటుందా.. అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయా అంటూ ఆలోచిస్తారు. ప్రతిసారీ నూతన సంవత్సరానికి సంబంధించి ముందుగానే అనేక నివారణలను ప్రయత్నించడం ప్రారంభిస్తారు. అయితే సరైన పద్ధతిలో నివారణ చర్యలు చేయకపోతే అందుకు తగిన ఫలితాలను పొందలేడు.

రానున్న కొత్త సంవత్సరంలో తమ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసుకోవాలని.. ఆగిన పనులు పూర్తి కావాలని.. కర్మ ఫలదాత అయిన శనిశ్వరుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ పరిష్కారాలతో అదృష్టం మెరుగుపడుతుంది. 2024 సంవత్సరం ముగిసేలోపు ఈ చర్యలు చేయడం వలన కొత్త ఏడాది లక్ కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

హనుమంతుడికి సింధూరం సమర్పించండి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిశ్వరుడి ప్రభావం నుంచి బయట పడేందుకు శనివారం నాడు హనుమంతుడికి సింధూరం, బెల్లం సమర్పించాలి. అదే విధంగా శనివారం హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ చర్యలు శనిశ్వరుడి ఆగ్రహం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. హనుమంతుడిని పూజించే ఏ భక్తుడివైపు శనిశ్వరుడు దృష్టి సారించారని మత విశ్వాసం.

ఇవి కూడా చదవండి

శనిశ్వరుడికి నువ్వులు , నూనె సమర్పించండి: ప్రతి శనివారం శనిశ్వరుడి ఆలయానికి వెళ్లి శనిశ్వరుడి పాదాలకు నల్ల నువ్వులు, ఆవనూనె సమర్పించండి. శనివారం రోజున నూనె దానం చేయడం ఉత్తమమని చెబుతారు. నూనెను దానం చేయడానికి ముందు ఒక గిన్నె నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి.. ఆ నూనెను అవసరమైన వ్యక్తికి దానం చేయండి.

శనిశ్వరుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించండి: శనిదేవునికి నీలిరంగు పువ్వులు సమర్పించడం ద్వారా శనిశ్వరుడి సంతోషిస్తాడు. అయితే పొరపాటున కూడా శనిశ్వరుడిని పూజించేటప్పుడు అతని విగ్రహాన్ని నేరుగా చూడకండి. పురాణ గ్రంధాల ప్రకారం శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను శనివారం పూజించాలి.

రావి చెట్టుకు నీటిని సమర్పించండి: 2024 సంవత్సరం ముగిసేలోపు శనిశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతిరోజూ రావి చెట్టుకు నీటిని సమర్పించి, పూజించి, రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి. అంతే కాదు శనివారం నాడు పేదవాడికి అన్నదానం చేయడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహం లభించి దారిద్ర్యం తొలగిపోతుంది.

రావి చెట్టు దగ్గర దీపం: ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత నిర్జన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. మీ దగ్గర ఎక్కడా రావి చెట్టు లేకుంటే శనిశ్వరుడి ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.