Shubh Yoga: ప్రస్తుతం చర రాశులదే హవా! ఆ రాశుల వారికి అత్యంత శుభ యోగాలు

జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు. ఈ రాశుల అధిపతులు, ఈ రాశుల్లో సంచారం చేస్తున్న గ్రహాలు అత్యంత శక్తిమంతంగా పనిచేస్తాయని, అతి త్వరగా ఫలితాలనిస్తాయని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రాశులకు శుభ యోగాలు పడితే అవి మిగిలిన రాశుల కంటే రెట్టింపు ఫలితాలనిస్తాయి.

Shubh Yoga: ప్రస్తుతం చర రాశులదే హవా! ఆ రాశుల వారికి అత్యంత శుభ యోగాలు
Shubh Yogas
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 19, 2024 | 4:59 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు. ఈ రాశుల అధిపతులు, ఈ రాశుల్లో సంచారం చేస్తున్న గ్రహాలు అత్యంత శక్తిమంతంగా పనిచేస్తాయని, అతి త్వరగా ఫలితాలనిస్తాయని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రాశులకు శుభ యోగాలు పడితే అవి మిగిలిన రాశుల కంటే రెట్టింపు ఫలితాలనిస్తాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఈ నాలుగు రాశులకు అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశులతో పాటు, ద్విస్వభావ రాశులైన కన్య, మీన రాశులు కూడా నెల రోజుల పాటు అత్యధికంగా శుభ ఫలితాలు, శుభ యోగాలను అనుభవించడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శని సంచారంతో పాటు, ధన, భాగ్య స్థానాధిపతుల పరివర్తన కూడా జరిగినందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా విజయవంతం అవుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతాల పెరుగుదల, పదోన్నతికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి జీవితం ఏర్పడుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి, బుధులు ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యంగా ధనపరంగా శుభ యోగాలు కలుగుతాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపట్టడం వంటివి జరుగుతాయి. సంతాన యోగం కలు గుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి కలిసి రావడం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశి ద్విస్వభావ రాశి అయినప్పటికీ, భాగ్య స్థానంలో గురువు. తృతీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సైతం అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభి స్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. తండ్రి వైపు నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడికి గురువుతో పరివర్తన కలగడం, ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారి ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగు తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అరు దైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శని ధన స్థానంలోనే ఉండడంతో పాటు, పంచమ స్థానంలో గురువు, లాభ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల అనేక విధాలుగా ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  6. మీనం: ఈ రాశి ద్విస్వభావ రాశి అయినప్పటికీ, రాశ్యధిపతి గురువు తృతీయంలో, శుక్రుడు లాభ స్థానంలో, దశమంలో రవి, బుధుల సంచారం వల్ల ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యో గాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?