Horoscope Today: ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 20, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల లాభపడతారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 20 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 20, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 20, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల లాభపడతారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగి బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల లాభపడతారు. కొందరు దగ్గర బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. డబ్బు విషయంలో ఎవరికీ మాట ఇవ్వవద్దు. ఉద్యో గంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కు వగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. ఉన్నతస్థాయి పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఒకటి రెండు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో ముఖ్య మైన లక్ష్యాలు, బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

బయట వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటి పరిస్థితులు ఏమంత అనుకూ లంగా ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్త వుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ లాభాలకు లోటుండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ పరిస్థితులు ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందు తాయి. శుభకార్యం విషయంలో బంధువులకు సహాయం చేస్తారు. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో పనితీరుతో అధికారులకు సంతృప్తి కలిగిస్తారు. వ్యాపారాలు నిలకడగా పురో గతి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. చేపట్టిన పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు సమర్థతకు తగిన గుర్తింపు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచ యాలు ఏర్నడతాయి. ఆస్తి వివాదాన్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేయగలుగుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి భూ లాభం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!