Astrology: రెండు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి జీవితంలో తిరుగులేని పురోగతి

Telugu Astrology: లాభాధిపతి, ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అన్ని విషయాల్లోనూ విశేషమైన పురోగతికి అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, పరిచయాలు వంటి విషయాల్లో ఈ ఆరు రాశుల వారు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.

Astrology: రెండు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి జీవితంలో తిరుగులేని పురోగతి
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 19, 2024 | 4:46 PM

లాభాధిపతి, ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అన్ని విషయాల్లోనూ విశేషమైన పురోగతికి అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, పరిచయాలు వంటి విషయాల్లో ఈ ఆరు రాశుల వారు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ఈ ధన, లాభాధిపతుల బలం వల్ల జీవిత గమనం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటి పరిణామాల వల్ల వీరి జీవితాలు చాలావరకు మారిపోతాయి.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానాధిపతి శని లాభ స్థానంలోనే ఉండడం, ధన స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మార్చి 29 వరకూ పట్టిందల్లా బంగారం అవుతుంది. దాదాపు ప్రతి రంగంలోనూ విశేషమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి లాభస్థానంలో మే 18 వరకూ రాహువు సంచారం వల్ల ఆదాయపరంగా ఊహించని అభి వృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ధన సంపాదనకు అవకాశాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు దాదాపు పూర్తిగా నష్టాల నుంచి బయటపడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశ మనం లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. తప్పకుండా ఉన్నత పదవులు లభించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారంతో పాటు ధనాధిపతి పంచమ స్థానంలో సంచారం వల్ల మే 25 వరకు ఈ రాశివారికి అనేక విధాలుగా ‘వృద్ధి’ యోగాలు పడతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయాలు సాధించడం జరుగుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి పాస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు, ధన స్థానంలో ధనాధిపతి శని సంచారం వల్ల జనవరి 4వ తేదీ వరకు ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  6. కుంభం: ఈ రాశికి లాభస్థానంలో శుక్రుడు, ధన స్థానంలో రాహువు సంచారం వల్ల నవంబర్ 29 లోపు ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. ఉద్యో గంలో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.