Zodiac Signs: రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో ఎన్ని యోగాలు పట్టినా రాశినాథుడు దుస్థానాల్లో ఉన్నా, నీచ పడినా, శత్రు క్షేత్రంలో ఉన్నా ఆ యోగాలు నిష్ఫలమైపోతాయి. రాశినాథుడు బలంగా ఉన్న ప్పుడు జాతకంలో ఏ యోగాలూ లేకపోయినా జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుంది.రాశుల అధిపతులు బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశుల వారి జీవితాలు అన్ని విషయాల్లోనూ నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంటుంది.

Zodiac Signs: రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 18, 2024 | 6:53 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో ఎన్ని యోగాలు పట్టినా రాశినాథుడు దుస్థానాల్లో ఉన్నా, నీచ పడినా, శత్రు క్షేత్రంలో ఉన్నా ఆ యోగాలు నిష్ఫలమైపోతాయి. రాశినాథుడు బలంగా ఉన్న ప్పుడు జాతకంలో ఏ యోగాలూ లేకపోయినా జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుంది. జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అవయోగాలున్నా కొట్టుకుపోతాయి. అందువల్ల రాశినాథుడు బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల అధిపతులు బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశుల వారి జీవితాలు అన్ని విషయాల్లోనూ నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా హోదాలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి జనవరి 21 వరకూ కొనసాగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందడం వల్ల ఆదాయపరంగా ఉచ్ఛస్థితికి చేరడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
  2. కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు ఈ నెలాఖరు వరకూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారి కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. లాభదాయక స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. గృహ, వాహన ప్రయ త్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. అనేక వైపుల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో సంపూర్ణ బలంతో ఉన్నందువల్ల డిసెంబర్ 16 వరకూ అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కార మవుతాయి. ఉద్యోగంలోనూ, సామాజికంగానూ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు విదేశాలకు వెళ్లే అవ కాశం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జనవరి 21 లోగా జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించడం జరుగుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడానికి అవ కాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
  5. మకరం: రాశ్యధిపతి శని ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల మార్చి 29 వరకు ధనాభివృద్ధి కొన సాగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమై, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు లాభసాటిగా సాగిపోతాయి.
  6. మీనం: రాశ్యధిపతి గురువు తృతీయంలో సంచారం చేయడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక విధాలైన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అంచనాలకు మించి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే