Horoscope Today: వారి ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 21, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 21 November 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 21, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 21, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితన వృత్తుల వారి సంపాదన విశేషంగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. రాబడికి ఏమాత్రం లోటుండకపోవచ్చు. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి క్షణం కూడా తీరికి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో అధికారులు మీ సమర్థతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగు తాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందు తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహాల అనుకూలతల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతుంటాయి. ఆర్థిక వ్యవహా రాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగు తుంది. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో మీ ఆలోచనలు ఆశించిన ఫలి తాలనిస్తాయి. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు తప్పక పోవచ్చు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల నుంచి సంపద కలిసి వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. అన్న దమ్ములతో సఖ్యత బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహం, ప్రాధాన్యం లభిస్తాయి. వ్యాపా రాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. కొందరు బంధుమిత్రుల విషయంలో అప్రమ త్తంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఇతరులతో ఆర్థిక లావాదేవీలను పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత పరిష్కరించుకుంటారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశిం చిన ఫలితం ఉంటుంది. ఆశించిన ధన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితంలో సమస్యలను అధిగమిస్తారు. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు గడిస్తారు. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ