Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indra Yoga: అరుదైన గ్రహ ప్రభావం.. వారి జీవితాలను మార్చనున్న ‘ఇంద్ర’ యోగం!

పాశ్చాత్య దేశాల్లో యురేనస్ అనే గ్రహాన్ని కూడా జ్యోతిష శాస్త్రంలో చేర్చి ఫలితాలు చెబుతుంటారు. ఈ గ్రహానికి భారతీయ జ్యోతిష శాస్త్రంలో కూడా క్రమంగా ప్రాధాన్యం ఏర్పడింది. భారత దేశంలో యురేనస్ గ్రహాన్ని ‘ఇంద్ర’ గ్రహంగా గుర్తించడం జరిగింది. ఇది ఆకస్మిక పరిణామాలను, ఊహించని మార్పులను సూచిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో ఏడేళ్ల పాటు సంచారం చేసే ఈ ఇంద్ర గ్రహం గత జూన్ 1వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించింది. ఇది 2031 వరకూ ఇదే రాశిలో కొనసాగుతుంది.

Indra Yoga: అరుదైన గ్రహ ప్రభావం.. వారి జీవితాలను మార్చనున్న ‘ఇంద్ర’ యోగం!
Indra Yoga Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 20, 2024 | 6:33 PM

పాశ్చాత్య దేశాల్లో యురేనస్ అనే గ్రహాన్ని కూడా జ్యోతిష శాస్త్రంలో చేర్చి ఫలితాలు చెబుతుంటారు. ఈ గ్రహానికి భారతీయ జ్యోతిష శాస్త్రంలో కూడా క్రమంగా ప్రాధాన్యం ఏర్పడింది. భారత దేశంలో యురేనస్ గ్రహాన్ని ‘ఇంద్ర’ గ్రహంగా గుర్తించడం జరిగింది. ఇది ఆకస్మిక పరిణామాలను, ఊహించని మార్పులను సూచిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో ఏడేళ్ల పాటు సంచారం చేసే ఈ ఇంద్ర గ్రహం గత జూన్ 1వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించింది. ఇది 2031 వరకూ ఇదే రాశిలో కొనసాగుతుంది. ధనం, భోగభాగ్యాలు, శారీరక సుఖ సంతోషాలు, పెళ్లిళ్లు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వృషభ రాశిలో ఇంద్ర గ్రహం ప్రవేశించినందువల్ల ఈ అంశాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఇది కొన్ని శుభ ఫలితాలను కలిగించే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో యురేనస్ లేదా ఇంద్ర గ్రహ సంచారం వల్ల ధనపరంగా ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సామాన్య స్థితిలో ఉన్నవారు సైతం ధనవంతు లయ్యే అవకాశం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ధనం సంపాదించడం జరుగు తుంది. డబ్బు విషయంలో మీ ఆలోచనలు, ప్రాధాన్యాలు మారిపోతాయి. ఆర్థిక స్థితిగతులు సమూలంగా మార్పు చెందుతాయి. కుటుంబ పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశిలో ఇంద్ర గ్రహ సంచారం వల్ల వ్యక్తిగత జీవితంలో నాటకీయ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఆశలు, ఆశయాలు, కోరికల్లో మార్పులు వస్తాయి. వ్యక్తిగత పురోగతి మీద శ్రద్ధ పెరు గుతుంది. అసాధారణ పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేపట్టి మీ ప్రతిభను నిరూపించుకుంటారు. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సాహ సాలకు, రిస్కులకు వెనుకాడరు. కెరీర్ పరంగా, ఆదాయపరంగా ఊహించని పురోగతి కలుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి 11వ స్థానంలో ఇంద్ర గ్రహ సంచారం వల్ల జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవు తుంది. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంస్థలు, సంఘాలతో చేతులు కలపడం జరు గుతుంది. మీ కలలు, ఆశలు, కోరికలు, ఆశయాలు మారిపోతాయి. వినూత్న సంపాదన మార్గా లను అనుసరించి ఘన విజయాలు సాధిస్తారు. భవిష్యత్తును గణనీయంగా మెరుగుపరచుకుం టారు. మూస జీవితం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. సొంత సంస్థను ప్రారంభిస్తారు.
  4. కన్య: ఈ రాశికి 9వ స్థానంలో ఇంద్రుడి సంచారం వల్ల సాధారణంగా సంప్రదాయ విరుద్ధమైన భావాలు ఏర్పేడతాయి. విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరూ ఊహించని వృత్తి, వ్యాపారాలను చేపట్టి సంపదలను కూడగట్టుకునే అవకాశం కూడా ఉంది. కొత్త విద్యలు, కొత్త నైపు ణ్యాలను ఒంటబట్టించుకోవడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలపరంగా సమూలమైన మార్పులు తప్పకపోవచ్చు. కులాంతర, మతాంతర వివాహాలకు అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో యురేనస్ సంచారం వల్ల సంబంధ బాంధవ్యాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో విదేశీయుల సహాయ సహకారాలతో వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది. సాహసాలు చేయాలనే కోరిక కలుగుతుంది. కొత్త చదువులు, నైపుణ్యాలు, వృత్తులు చేపట్టడం జరుగుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఇంద్ర గ్రహ సంచారం వల్ల అనుకోకుండా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. సంబంధ బాంధవ్యాలలోనే కాక, భావాలు, ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. అతి సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి మారే అవకాశం ఉంటుంది. కొత్త నైపుణ్యాలు, ప్రజ్ఞలను నేర్చుకోవడం జరుగుతుంది. అధునాతన జీవనశైలి అలవడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడా నికి అనేక మార్గాలను అనుసరించి విజయాలు సాధిస్తారు. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది.