Money Astrology: వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకూ వృశ్చిక రాశిలో బుధుడు వక్రించడం జరుగుతుంది. సాధారణంగా బుధుడి వక్రగతి వల్ల కొందరి జీవితాలు ‘తారుమారు’ అవుతాయి. కష్టాలు లేని వారికి సమస్యలు తలెత్తుతాయి. కష్టాల్లో ఉన్నవారికి కష్టాలు తీరుతాయి. కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి, కోర్టు వివాదాల నుంచి, ఆస్తి చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంది.

Money Astrology: వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Budh Vakri
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 21, 2024 | 3:32 PM

ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకూ వృశ్చిక రాశిలో బుధుడు వక్రించడం జరుగుతుంది. సాధారణంగా బుధుడి వక్రగతి వల్ల కొందరి జీవితాలు ‘తారుమారు’ అవుతాయి. కష్టాలు లేని వారికి సమస్యలు తలెత్తుతాయి. కష్టాల్లో ఉన్నవారికి కష్టాలు తీరుతాయి. బుధుడి వక్రగతి వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి, కోర్టు వివాదాల నుంచి, ఆస్తి చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ రాశులవారి ప్రతిభా పాటవాలు విశేషంగా రాణిస్తాయి.

  1. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు వక్రిస్తున్నందువల్ల జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. పిల్లలు సునాయాసంగా ఘన విజ యాలు సాధిస్తారు. సంతానం యోగం కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవు తారు. ఊహించని విధంగా ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో వక్రించడం వల్ల పంచమ స్థాన ఫలితాలను ఇవ్వడం జరుగు తుంది. దీనివల్ల బుధుడు దాదాపు మూడు వారాల పాటు ధనాభివృద్ధిని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక, రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అనారో గ్యాలతో అవస్థలు పడుతున్నవారికి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆస్తిపాస్తుల విష యంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో వక్రించినందువల్ల ధన స్థాన ఫలితాలను ఇవ్వడం జరు గుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  4. తుల: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు వక్రించినందువల్ల ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆదా యపరంగా అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందు తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. ప్రముఖుడి స్థాయికి ఎదుగుతారు.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు వక్రించినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించి, ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురు తుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. అనారోగ్యాల బాధ చాలావరకు తగ్గిపోతుంది.
  6. కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు వక్రిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో హోదా, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. ఆదాయం కూడా ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!