Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 22, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మిథున రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 22 November 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 22, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 22, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మిథున రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగా వృద్ది చెందడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో భారీగా మార్పులు జరిగే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభి స్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తడానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగు తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సోదరులతో విభే దాలు ఏర్పడతాయి. పిల్లల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉన్నత కుటుం బంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు బాగా పెరుగుతాయి. మొత్తం మీద చేతిలో డబ్బు నిలవ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయ స్కరం. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా గడిచిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. సోదరులతో సయోధ్య కలుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల వంటివి లాభాల పంట పండిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపా రాలు లాభాలపరంగా నిలకడగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇత రుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. సామాజికంగా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మీ ప్రతిభకు, సమర్థతకు సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధనపరంగా తప్పకుండా అదృష్టం పడుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులు విదేశాల్లో అవకాశాలకు ప్రయత్నించడం చాలా మంచిది. తండ్రి వైపు నుంచి అన్నివిధాలు సహాయ సహకారాలు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన ప్రయ త్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థితిగతుల పరంగానే కాక, ఆదాయపరంగా కూడా ఊహించని వృద్ధి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపులు చేయడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ప్రముఖులతో సత్సంబం ధాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవు తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విలాస జీవితం మీద వ్యామో హం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధి కారులతో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రహస్య శత్రువులు తయారవుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సుఖ సంతోషాల మీద, సరికొత్త సౌకర్యాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే బాగా రాణిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీత భత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుం బంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఇంటా బయటా కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కొద్దిపాటి అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయ వృద్దికి అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు కూడా సఫలం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?