ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం: కళ్లను రుద్దడం వల్ల.. మన చేతుల్లో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా కంటి ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు. మనం కళ్లను రుద్దినప్పుడు, ఈ హానికరమైన అంశాలు కళ్లలోపలికి చేరి, ఎరుపు, దురద, మంట వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ అలవాటును చాలా కాలం పాటు కొనసాగించడం వల్ల కండ్లకలక (పింక్ ఐ ఇన్ఫెక్షన్) లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లకు దారితీయవచ్చు.