మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట ‘వీర మహిళల’ నిరసన.. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..
Guntur: పవన్‌పై వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు మహిళలు పోలీసులను తోసుకుంటూ వెళ్లి కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మరోసారి తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన మహిళలు కార్యాలయం వెలుపల..
గుంటూరు, జూలై 31: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసేన వీర మహిళలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. పవన్‌పై వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు మహిళలు పోలీసులను తోసుకుంటూ వెళ్లి కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మరోసారి తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన మహిళలు కార్యాలయం వెలుపల బైఠాయించగా, పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్ నటించిన ప్రేమకథా చిత్రాలే టీనేజీ, మహిళల అదృశ్యానికి కారణమని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ నెల 27న జనసేనానిపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలా వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన వీర మహిళల ఈ రోజు మహిళా కమిషన్‌కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..