Solar Eclipse 2023: వచ్చే సూర్యగ్రహణం ఈ రాశులవారికి కష్టాలను తెస్తుంది.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

Solar Eclipse 2023: గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా తమదైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక 2023 సంవత్సరంలో ఏర్పడే రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14 సంభవించనుండగా.. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాలను చూపించనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాశులవారు అమితమైన కష్టాలను ఎదుర్కొంటారు. ఇంతకీ రెండో సూర్యగ్రహణం ఎవరికి మంచిది కాదో..

Solar Eclipse 2023: వచ్చే సూర్యగ్రహణం ఈ రాశులవారికి కష్టాలను తెస్తుంది.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
2nd Solar Eclipse In 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 30, 2023 | 8:44 PM

2nd Solar Eclipse 2023: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు ప్రముఖ స్థానం ఉంది. ఈ గ్రహణాల సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇంకా ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా తమదైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడుతుండగా.. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం(ఏప్రిల్ 20), ఒక చంద్రగ్రహణం(మే 5) ముగిశాయి. అయితే ఇంకా ఒక సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మిగిలే ఉన్నాయి. ఈ ఏడాది ఏర్పడాల్సిన రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14 సంభవించనుండగా.. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాలను చూపించనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాశులవారు అమితమైన కష్టాలను ఎదుర్కొంటారు. ఇంతకీ రెండో సూర్యగ్రహణం ఎవరికి మంచిది కాదో ఇప్పుడు చూద్దాం..

సింహ రాశి: ఈ ఏడాది సంభవించే రెండో సూర్యగ్రహణం సింహరాశివారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు అన్ని ఉన్నా లేనట్లే జీవిస్తారు. ఇంకా ఆర్థిక నష్టాన్ని పొందుతారు. నలుగురి నోట మాట పడతారు. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉండడమే ఎంతో శ్రేయస్కరం.

తుల రాశి: రెండో సూర్యగ్రహణం తులరాశివారిపై చెడు ప్రభావం చూపుతుంది. ఫలితంగా మీ దాంపత్య జీవితంలో గొడవలు, మానసిక ఆందోళన, అన్నదమ్ములతో కలహాలను ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా అపజయమేనన్న పరిస్థితులతో క్రుంగిపోతారు.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి: అక్టోబర్ 14న ఏర్పడే సూర్యగ్రహణం కన్యారాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి నమ్మకద్రోహం, నిరాశ ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది.

వృషభ రాశి: త్వరలో సంభవించే రెండో సూర్యగ్రహణం వృషభరాశివారికి బాధకరమైన పరిస్థితులకు కలిగిస్తుంది. ఫలితంగా మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. కీలక బాధ్యతలు అందుకుంటారు కానీ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

(గమనిక: ఈ ఆర్టికల్‌లో తెలిపిన సమాచారం జ్యోతిష నిపుణులు తెలిపిన వివరాల మేరకు అందించడం జరుగుతుంది. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి