Zodiac Signs: బలహీనపడుతున్నరాహువు.. వారికి ఆ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించడం తథ్యం.. !
Astro Tips in Telugu: మేష రాశిలో సంచరిస్తున్న రాహువు ప్రస్తుతం బాగా బలహీనపడుతున్నాడు.రాహువు బలహీన పడడంతో ఈ గురు చండాల యోగ దుష్ఫలితాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మరో రెండు మూడు నెలల్లో తన 18 నెలల మేష రాశి సంచారానికి స్వస్తి చెప్పబోవడం, పైగా కేతు నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల గత జూలై 17వ తేదీ నుంచి రాహువు బాగా బలహీనపడడం జరుగుతోంది.

Weak Rahu Astro Predictions: మేష రాశిలో సంచరిస్తున్న రాహువు ప్రస్తుతం బాగా బలహీనపడుతున్నాడు.ఇక్కడ గురు గ్రహంతో రాహువు కలవడం వల్ల గురు చండాల యోగం కూడా ఏర్పడింది. రాహువు బలహీన పడడంతో ఈ గురు చండాల యోగ దుష్ఫలితాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మరో రెండు మూడు నెలల్లో తన 18 నెలల మేష రాశి సంచారానికి స్వస్తి చెప్పబోవడం, పైగా కేతు నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల గత జూలై 17వ తేదీ నుంచి రాహువు బాగా బలహీనపడడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రపరంగా ఇదొక మంచి పరిణామం. రాహువు బలహీనపడడం వల్ల వివిధ రాశుల మీద దీని చెడు ప్రభావం తగ్గి, శుభ ఫలితాలు అనుభవానికి రావడం, ఎంతో ఉపశమనం లభించడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశిలో పరమ పాప గ్రహమైన రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా టెన్షన్లు పడే అవ కాశం ఉంటుంది. ఈ రాశిలో గురు, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడి, జీవి తంలో కొన్ని అవాంఛనీయ పరిణామాలకు అవకాశమిచ్చింది. ప్రస్తుతం రాహువు బలహీనపడి నందు వల్ల ఈ రాశి వారికి ఊహించని ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత, కెరీర్ సమస్యలు పరి ష్కారం అయ్యే అవకాశం ఉంది. గురువు పూర్తి స్థాయి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది.
- వృషభం: వ్యయ స్థానంలో ఉన్న రాహువు వల్ల శత్రు బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అనవ సర వ్యయాలు జరగడం, డబ్బు మిగల్చుకోవడానికి అవకాశం లేకపోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ మీద బురద చల్లేవారు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్లు ఉంటారు. రాహువు వ్యయ స్థానం నుంచి నిష్క్రమిస్తున్నందువల్ల , బలహీనపడినందువల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది.
- మిథునం: ప్రస్తుతం లాభ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల గత పదిహేడు నెలలుగా ఆశించిన స్థాయిలో పురోగతి లేక ఇబ్బంది పడుతున్న ఈ రాశివారు క్రమంగా కొన్ని రకాల దుస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగత, కెరీర్ పరమైన పురోగతికి, అభివృద్ధికి అడ్డుపడు తున్న పరిస్థితులు నెమ్మదిగా కనుమరుగు కావడం జరుగుతుంది. మున్ముందు ఎటువైపు చూసినా లాభాలే కనిపించే సూచనలున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం కూడా ఉంటుంది.
- కర్కాటకం: దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్న రాహువు బలహీనపడడం వల్ల ఈ రాశి వారికి ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికి, అధికార యోగం పట్టడానికి మార్గం సుగమం అవుతుంది. గురు గ్రహ అనుగ్రహం పూర్తి స్థాయిలో లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు విడుదల అవుతాయని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో చిన్నచూపు చూసినవారే ఇప్పుడు గౌరవించడం జరుగుతుంది.
- సింహం: నవమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల ఉన్నత విద్యకు, విదేశీయానానికి, ధన లాభానికి అవకాశాలు కోల్పోయిన సింహ రాశివారికి అదృష్టం తిరగబడే అవకాశం ఉంది. రాహువు బలం తగ్గడం వల్ల, గురువు బలం పెరగడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఈ స్థానంలో ఉన్న గురువు వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, ఆర్థిక పరిస్థితి మెరుగవడం జరుగుతుంది.
- కన్య: అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల అర్థం కాని అనారోగ్యాలు, నిర్ధారణ కాని అనారోగ్యాలతో అవస్థలు పడడం, ఏ పనిలోనైనా టెన్షన్ ఉండడం, ఆస్తి వివాదాలతో ఇబ్బంది పడడం వంటివి జరుగుతాయి. ఇక క్రమంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అష్టమ రాహువు వల్ల చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా, పరిష్కరించలేని సమస్యలుగా భావిం చడం జరుగుతుంది. ఈ రకమైన మానసిక సమస్యల నుంచి నెమ్మదిగా పరిష్కారం లభిస్తుంది.
- తుల: సప్తమ రాహువు వల్ల ఈ రాశివారికి మంచి యోగాలు చేజారిపోవడం జరుగుతోంది. సప్తమంలో ఉన్న గురు గ్రహం కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా ఇవ్వాల్సిన శుభ ఫలితాలకు ఈ పాప గ్రహం అడ్డుపడడం జరుగుతుంది. ఇప్పుడిక రాహువు బలహీనపడడం వల్ల ఈ యోగాలన్నీ పూర్తి స్థాయిలో వర్తించడం ప్రారంభం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లోని ఆటంకాలు, ఉద్యోగ స్థానంలో ఉన్న కుట్రలు, కుతంత్రాలు చాలావరకు తొలగిపోతాయి. పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానం నుంచి రాహువు త్వరలో నిష్క్రమించబోవడం ఒక దుర్వార్త కిందే లెక్క. ఈ రాశివారు ఆరవ స్థానంలో సంచరిస్తున్న రాహువు కారణంగానే ఆర్థిక సమస్యలకు దూరంగా జీవించగలుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి నిలగడగా, స్థిరంగా ఉండడానికి షష్ట రాహువు తోడ్పడుతుంది. అనారోగ్య సమస్యలే, శత్రు సంబంధమైన బాధల నుంచి కూడా రాహువే ఉపశ మనం కలిగిస్తాడు. రాహువు బలహీనపడడం వల్ల ఈ రాశివారు కొన్నిలాభాలకు దూరం అవు తారు.
- ధనుస్సు: ఈ రాశివారికి అయిదవ స్థానంలో సంచరిస్తున్న రాశినాథుడు గురువుతో రాహువు కలిసి ఉండడం పిల్లల విషయంలో ఇబ్బందులకు కారణం అవుతుంది. ఈ రాశివారి ఆలోచనలు, నిర్ణ యాలు, ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి, పని చేయకపోవడానికి పంచమ రాహువే చాలా వరకు కారణం అవుతోంది. ఇటువంటి రాహువు బలం కోల్పోవడం వల్ల రాశి నాథుడైన గురువు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది.
- మకరం: సుఖ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల సుఖ సంతోషాలకు భంగం ఏర్పడుతుంది. ఈ స్థానంలో సంచరిస్తున్న గురువు వృత్తి, ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఇవ్వకుండా రాహువు అడ్డుపడడం జరుగుతుంది. రాహువుకు శక్తి తగ్గడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల పరం గానే కాకుండా కుటుంబ పరంగా కూడా టెన్షన్లు తగ్గడం, మనశ్శాంతి ఏర్పడడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సంబంధమైన ఆటంకాలు కూడా తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది.
- కుంభం: ఈ రాశికి మూడవ స్థానంలో సంచరిస్తున్న రాహవు వల్ల తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదాలు ఏర్పడడం, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, కుటుంబ సభ్యులను పట్టించుకునే తీరిక లేకపోవడం, అనవసర ప్రయాణాలు చేయడం, విలువైన వస్తువులు కోల్పోవడం, బంధుమిత్రు లతో అపార్థాలు చోటు చేసుకోవడం, ఎంత ప్రయత్నించినా పనులు కాకపోవడం వంటివి జరుగు తాయి. ఇప్పుడు ఇవన్నీసమసిపోతాయి. ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది.
- మీనం: ధన స్థానం, కుటుంబ స్థానమైన ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి గురువుతో రాహువు కలిసి ఉండడం వల్ల తరచూ ధనపరంగా, కుటుంబపరంగా ఏర్పడుతున్న సమస్యలకు క్రమంగా తెరపడుతుంది. గురువును రాహువు విడిచిపెడుతుండడం వల్ల, ప్రస్తుతం గురువుకు రాహువు దూరంగా జరగడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలైన సత్ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక సమస్యలకు, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.




Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి