Kakinada: పెద్దాపురంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లతో వేడెక్కిన రాజకీయం

కాకినాడ జిల్లా పెద్దాపురంలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ, తెలుగుదేశం వర్గాలు సవాళ్ల యుద్ధం కొనసాగుతుంది. మట్టి తవ్వకాలపై మాటల మంటలు కొనసాగుతున్నాయి. లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని ఛాలెంజ్‌లు విసరుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున పోలీసులు బలగాలను మొహరించారు అధికారులు. ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు.

Kakinada: పెద్దాపురంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లతో వేడెక్కిన రాజకీయం
Davuluri Dorababu vs Chinna Rajappa
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 31, 2023 | 4:15 PM

కాకినాడ, జులై 31: పెద్దాపురంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్‌కి చేరింది. ఎమ్మెల్యే చినరాజప్ప, వైసీపీ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు తమ కార్యకర్తలతో బలప్రదర్శనకు దిగారు. లై డిటెక్టర్‌ టెస్టుకు రెడీ అవడంతో.. వారిద్దరు పాదయాత్రగా మునిసిపల్‌ సెంటర్‌కి బయలుదేరారు. రెండు గ్రూపులనూ పోలీసులు అడ్డుకున్నారు. రాజప్పను మహారాణి కాలేజీ దగ్గరే ఆపేశారు పోలీసులు. దొరబాబు సవాల్‌ను ఎదుర్కొనేందుకే వెళ్తున్నానని.. తనను అడ్డుకోవద్దని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే చినరాజప్ప. వైసీపీ నేతలు మున్సిపల్‌ సెంటర్‌కి వస్తే.. తానూ వస్తానని.. వారిని కూడా కట్టడి చేయాలన్నారు ఎమ్మెల్యే.

అటు దొరబాబుని కూడా క్యాంప్‌ కార్యాలయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసేసి వెళ్లే ప్రయత్నం చేశారు. రాజప్ప తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకుంటానన్నారు దొరబాబు. అలాంటి వాటికి అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో దొరబాబు వెనుతిరిగారు. రెండ్రోజులుగా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేస్కుని అవి నిరూపించుకునేందుకు లై డిటెక్టర్ టెస్టుకు ఈరోజు ఉదయం పెద్దాపురం మునిసిపల్ సెంటర్‌కి రావాలని సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.పెద్దాపురంలో అవినీతిని చినరాజప్ప కొత్త పుంతలు తొక్కించారన్నారు దొరబాబు. లై డిటెక్టర్‌ టెస్టుకు రెడీ అవ్వాలన్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పిఠాపురంలోని YSRCP, TDP ఆఫీసుల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఇరు పార్టీల ప్రధాన నాయకులు, అనుచరుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాంటి ర్యాలీలకు, నిరసనలకు పర్మిషన్   లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..