AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitanya Ratham: ‘రంగు’ పెట్టిన చిచ్చు.. పవన్‌ ‘చైతన్య రథానికి’ బ్రేకులు పడతాయా?

ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనరిజమ్. సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్‌లో కూడా పంచూ పవరూ ఉంటేనే కిక్కు అంటున్నారు. అదే సీక్వెన్స్‌లో ఆయన లేటెస్ట్‌గా చేసిన ఒక దుస్సాహసం..

Chaitanya Ratham: ‘రంగు’ పెట్టిన చిచ్చు.. పవన్‌ ‘చైతన్య రథానికి’ బ్రేకులు పడతాయా?
Janasena Varahi
Shiva Prajapati
|

Updated on: Dec 09, 2022 | 8:46 AM

Share

ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనరిజమ్. సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్‌లో కూడా పంచూ పవరూ ఉంటేనే కిక్కు అంటున్నారు. అదే సీక్వెన్స్‌లో ఆయన లేటెస్ట్‌గా చేసిన ఒక దుస్సాహసం.. బూమరాంగ్ అవుతోందట. ముచ్చటపడి తయారు చేసుకున్న వారాహి వాహనం షెడ్డుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడిందట. అవును, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‌తో జనసేన ఇంట్రడ్యూస్ చేసుకున్న పవన్‌కల్యాణ్ చైతన్యరథం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌.. లోపలొక ఫోల్డబుల్ మీటింగ్ రూమ్.. టాప్‌ మీదికి చేరుకోడానికి ఒక పవర్‌లిఫ్టు.. రిఫ్రెష్‌మెంట్ డెస్క్.. ఇటువంటి స్పెషాలిటీస్ బోలెడన్ని. కానీ.. వీటితో పాటు గేర్లు, యాక్సిలేటర్లూ ఉన్నట్టే బండికి బ్రేకులు కూడా ఉంటాయ్‌గా.. ఆ బ్రేకులే పడబోతున్నాయట జనసేన వారి వారాహికి.

వైసీపీ సెటైర్లు..

మిలిటరీ తప్పితే మరే ప్రయివేటు వ్యక్తులూ తమ వెహికల్స్‌కి అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషిద్ధం. అలా వాడితే రిజిస్ట్రేషన్ చెయ్యకూడదన్నది 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధన. ఆఖరికి మోటార్ బైక్ మీద కూడా ఆలివ్‌గ్రీన్ కనిపించకూడదన్నది రూల్. ఇంకేముంది.. జనసేన ఖాతాలో మరో విజయం.. అంటూ అధికారపక్షం నుంచి వీర లెవల్లో సెటైర్లు షురూ అయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ ప్రచార వాహనం ‘వారాహి’కి తెలుపు, నలుపు, మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్‌ గ్రీన్‌ రంగు వేశారని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా చేయరని, లక్షల పుస్తకాలు చదివానని చెప్పే పవన్‌.. ఇండియన్‌ మోటర్‌ వెహికల్‌ యాక్ట్‌ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వేషాలు సినిమాలో వేయవచ్చని, నిజ జీవితంలో కుదరదని అన్నారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే నడవదన్నారు. కాల్‌షీట్ పొలిటీషియన్ కావడం వల్లే ఆయన ఇలా చేస్తున్నారని, చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ చదవడం మినహా ఆయనకు ఏదీ తెలియదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

రవాణా శాఖ అనుమతి కావాల్సిందే..

ఇదిలాఉంటే.. కస్టమైజ్డ్ వాహనం రోడ్డెక్కాలంటే బోలెడన్ని ఫార్మాలిటీస్ ఉంటాయ్. రవాణా శాఖ అనుమతి లేకుండా ఏ వెహికల్లూ బైటికి రాదు. సేఫ్టీ, ఫిట్నెస్, కలరూ గట్రా అన్నీ పరిశీలించాకే అప్రూవల్ ఇస్తారు. ఈ విషయం జనసేన స్ట్రాటజిస్టులకు తెలియదా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన ప్రశ్నలు..

ఆలివ్ గ్రీన్ రంగులేసుకుని రోడ్ల మీద తిరిగే మిగతా టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంగతేంటి? అని జనసేన నుంచి వస్తున్న ప్రశ్నలు. సాక్షాత్తూ బ్రాండెడ్ కంపెనీలే మీక్కావల్సిన రంగు మా దగ్గర వుంది అంటూ.. కోరిన రంగులేసి సప్లయ్ చేస్తుంటే వాటినెవ్వరూ ప్రశ్నించరేం అని నిలదీస్తున్నారు జనసైనికులు. ఆమాటకొస్తే తెలుగుదేశం ఆవిర్భావం కోసం ఎన్టీఆర్ ఎక్కిన చైతన్య రథం రంగు కూడా దాదాపుగా ఆలివ్‌గ్రీనే అని కొత్త లాజిక్కును తెరమీదకు తెస్తున్నారు పవన్.

అవసరమైతే కలర్ మార్పు..

ఇంకా కలర్ కంప్లీట్ కాలేదని, మరీ అవసరమనిపిస్తే రంగు మార్చి జనసేన కలర్స్ రెడ్ అండ్ వైట్ వేసుకుంటారని మరో టాక్ కూడా వినిపిస్తోంది. కానీ.. మనల్నెవడ్రా ఆపేది అంటూ ఇప్పుడున్న మిలిటరీ కలర్స్‌తోనే యుద్ధట్యాంకునెక్కినా ఎక్కుతారు పీకే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..