AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చేలా చేసింది. విచక్షణ కోల్పోయిన భర్త స్క్రూ డ్రైవర్‌తో పొడిచి భార్యను అంతమొందించాడు. దీంతో అభం శుభం తెలియని నాలుగు నెలలు చిన్నారి తల్లి లేని అనాధగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే
Vizag Incident
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 10:50 AM

Share

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్.. తన భార్య మాయతో కలిసి 8 నెలల క్రితం పొట్టకూటి కోసం అనకాపల్లి జిల్లాకు వచ్చేశాడు. ఎలమంచిలిలో ఓ స్క్రాప్ దుకాణాన్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు రాకేష్. అక్కడే భార్య, నాలుగు నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నాడు. మాయ 12 ఏళ్ల పెద్ద కుమార్తె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో సెల్‌ఫోన్ కలహాన్ని నింపింది. మాయ.. సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందని గమనించిన రాకేష్ పలుమార్లు ప్రశ్నించాడు. ఈ విషయంలో గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం కూడా రాకేష్ బయటకి వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి భార్య మాయ.. ఫోన్ మాట్లాడుతూ లీనమై ఉంది. వెంటనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్.. ఆమెను ప్రశ్నించాడు. మాట మాట పెరిగింది.

దీంతో మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పక్కనే ఉన్న 4నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య మాయ ఫోన్‌లో మాట్లాడుతోందని గుర్తించిన రాకేష్.. అనుమానంతో హత్య చేశాడని ఎలమంచిలి సిఐ ధనుంజయ తెలిపారు.

తల్లికోసం..

మాయకు నాలుగు నెలల చిన్నారి ఉంది. తల్లి కోల్పోవడంతో చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసిడిఎస్ సిబ్బంది. తల్లి లేక ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి సపర్యలు చేస్తున్నారు. మాయ ఇద్దరు పిల్లలు.. తొలి భర్తకు పుట్టిన కూతురు అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. రాకేష్, మాయ దంపతులకు ఇటీవలే ఓ చిన్నారి జన్మనిచ్చింది. చిన్నారికి నాలుగు నెలలు. మాయకు ఇద్దరు పిల్లలు.. 12 ఏళ్ల మొదటి పాప అమ్మమ్మ దగ్గర ఉంటుందని.. మాయ రాకేష్ దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉందని అన్నారు సీఐ ధనంజయ. తల్లి కోల్పోవడంతో చిన్నారిని ఐసిడిఎస్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో ఉంచామన్నారు.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..