ఇదే లాస్ట్ ఛాన్స్.. డిసెంబర్ 31లోపు ఈ చిన్న పని చేయకపోతే మీకు రూ.వెయ్యి ఫైన్.. అందరూ జాగ్రత్త పడండి
ఆధార్-పాన్ లింకింగ్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తప్పనిసరి చేసింది. 2024కి ముందు ఆధార్ కార్డులు తీసుకున్నవారు దీనిని చేసుకోవాలి. లేకపోతే జనవరి 1వ తేదీ తర్వాత మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రూ.వెయ్యి జరిమానా కూడా విధించాల్సి రావొచ్చు.

Aadhar-PAN Link: ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడానికి ఇక కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ లోపు చేయకపోతే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది. లేదా మీ పాన్ కార్డు రద్దయ్యే ప్రమాదముంది. మీరు ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే లింక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ పాన్, ఆధార్ కార్డుల్లో ఒకేలా పేరు, ఇతర వివరాలు లేకపోతే లింక్ అవ్వదు. ఇలాంటి పేరు వెంటనే రెండింటిల్లో ఒకేలా పేరు ఉండేలా మార్చుకుని లింక్ చేసుకోండి.
డిసెంబర్ 31వ తేదీ వరకు ఆధార్-పాన్ లింక్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ లోపు చేసుకోకపోతే మీరు సమస్యల్లో పడవచ్చు. రూ.వెయ్యి వరకు మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జరిమానా వేయవచ్చు. ఇక పాన్ కార్డును రద్దు కూడా చేయవచ్చు. పాన్ కార్డును రద్దు చేస్తే మీరు జనవరి 1 నుంచి ఎలాంటి బ్యాంకింగ్, ఆర్ధిక కార్యకలాపాలు జరపలేరు. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పొందలేరు. అక్టోబర్ 1,2024కి ముందు ఆధాన్ నమోదు ఐడీ అధారంగా పాన్ కార్డును పొందినవారు ఇప్పుడు రెండింటినీ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాన్ కార్డు పొందినవారికి ఆటోమేటిక్‌గా లింక్ చేసి ఉంటుంది.
రెండింటిల్లో వివరాలు ఒకేలా లేకపోతే..
పాన్ కార్డులో ఒకలా.. ఆధార్ కార్డులో మరోలా పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇతర వివరాలు ఉంటే మీరు లింక్ చేయాలని ప్రయత్నిస్తే ఫెయిల్ అవుతుంది. ఇలాంటివారు ఆధార్ కార్డులో లేదా పాన్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకోవడం వల్ల ఒకేలా ఉంటాయి. ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే UIDAI వెబ్‌సైట్ నుంచి ఇంటి వద్దనే చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఏదైనా ఆధార్ సెంటర్‌కి వెళ్లి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక NSDL లేదా UTIITSL వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆధార్-పాన్ లింక్ చేసుకోండి.
