Tollywood: ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. 3 సినిమాలతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు.. గుర్తు పట్టారా?
సినిమా సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ముఖ్యంగా పుట్టిన రోజులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో హీరో, హీరోయిన్ల త్రో బ్యాక్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలా ఇప్పుడు ఒక టాలీవుడ్ సెన్సేషన్ త్రో బ్యాక్ ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ఇది అతని కాలేజ్ డేస్ నాటి ఫొటో.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఎవరో హీరోలా ఉన్నాడనుకుంటున్నారా? కానీ అతను అంతకు మించి.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్, ఫాలోయింగ్ అతని సొంతం. అలాగనీ అతను పెద్దగా సినిమాలు చేయలేదు. మూడంటే మూడే సినిమాలు చేశాడు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు. రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను శాసించాడు. తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఎనిమిదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఉన్నత చదవుల కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫిజియో థెరపీలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేశాడు. 2005లో మనసు మాట వినదు అనే ఓ చిన్న సినిమాకు అప్రెంటిస్ గా పని చేశాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు.
అయితే ఆ తర్వాత అంతకు మించిన పవర్ ఫుల్ సబ్జెక్టుతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోను సెలెక్ట్ చేసుకుని సినిమాను తీశాడు. కట్ చేస్తే.. ఈ డైరెక్టర్ దెబ్బకు.. బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కుచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు మూడు సినిమాలు తీస్తే అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు చేరువైంది. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా..
View this post on Instagram
ఇవాళ (డిసెంబర్ 25) సందీప్ రెడ్డి వంగా పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నాడు. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. అది అతని కాలేజీ రోజుల నాటిదని తెలుస్తోంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు సందీప్. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




