AP Rains: ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా.? తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఏంటి.? రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయా.? అని ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలు ఏంటంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. ఉత్తర కోస్తాంద్ర, యానాంలతో పాటు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. గరిష్టంగా ఖమ్మం లో 21.4 డిగ్రీలు, కనిష్టంగా మెదక్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు మహబూబ్ నగర్, భద్రాచలం, హనుమకొండలో 19.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 19.2, రామగుండం 19, దుండిగల్ 18.4, హైదరాబాద్ 18, నల్లగొండ 18, రాజేంద్రనగర్ 17.5, హకీమ్‌పెట్ 17.2, హయత్‌నగర్ 17, పఠాన్ చెరువు 16.4, ఆదిలాబాద్ 16.2, మెదక్ 15.4 డిగ్రీలు నమోదయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








