AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ ఇలా.. ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఏంటి.? రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయా.? అని ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలు ఏంటంటే..
ఏపీని వర్షాలు వీడట్లేదు. మళ్లీ పలు ప్రాంతాల్లో దంచికొట్టనున్నాయి. వాతావరణ శాఖ రాష్ట్రంలో వచ్చే 3 రోజులు హెచ్చరికలు జారీ చేసింది. వెదర్ రిపోర్ట్ ఇలా ఉండనుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మిగిలిన చోట్ల వాతావరణ పొడిగా ఉంటుందని తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. —————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- ——————————
ఈరోజు:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ:- ————–
ఈరోజు:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.