Tiger Birthday: రాయల్ బెంగాల్ టైగర్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్.. చూస్తే మతిపోవాల్సిందే..
అడవికి రారాజు సింహం అయినా పులులు కూడా తమ టెర్రిటరీ లో అంతకు మించి. వాస్తవానికి సింహం కంటే అడవికి రాజు అనే బిరుదును పొందగలిగే శక్తివంతమైన జంతువులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో.. సింహంతో పోల్చి చూస్తే, అత్యంత సమీపంలో పులి అనే చెప్తాం. పులి, సింహాల మధ్య అనేక ఆసక్తికర బేధాలు ఉంటాయి. సింహం ఆకలి అయినప్పుడు మాత్రమే వేటాడుతుంది.

అడవికి రారాజు సింహం అయినా పులులు కూడా తమ టెర్రిటరీ లో అంతకు మించి. వాస్తవానికి సింహం కంటే అడవికి రాజు అనే బిరుదును పొందగలిగే శక్తివంతమైన జంతువులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో.. సింహంతో పోల్చి చూస్తే, అత్యంత సమీపంలో పులి అనే చెప్తాం. పులి, సింహాల మధ్య అనేక ఆసక్తికర బేధాలు ఉంటాయి. సింహం ఆకలి అయినప్పుడు మాత్రమే వేటాడుతుంది. పులికి ఆహారం దొరికినప్పుడు తన భార్య తినడానికి ఎక్కువగా వేచి ఉంటుంది, కానీ సింహం అలా వేచి ఉండడం జరగదు. వాస్తవానికి పులి సింహం కంటే తెలివైనదని, దానికంటే భయంకరమైనదని నిరంతరం వాటి జీవన విధానం, ప్రవర్తన పై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
అందరూ సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు కానీ అది అడవిలో కంటే ఎక్కువ కలుపు మొక్కలు, విశాలమైన మైదానాల మధ్య జీవించడానికి ఇష్టపడుతుందనేది ఇప్పటికే నిర్ధారించిన అంశం . కానీ పులి మాత్రం దట్టమైన, అభయ అరణ్యాలలోనే నివసిస్తుంది. ముఖ్యంగా రాయల్ బెంగాల్ టైగర్ తనకంటూ కనీసం ఒక ఐదు కిలోమీటర్ల పరిధిని ఎంచుకుని అక్కడ జెండా నాటుతుంది. ఆ ఏరియా అంతా తన కనుసన్నల్లోనే ఉండేట్టు చూసుకుంటుంది. ఇలా సింహం నీటి వైపు ఎక్కువ రాదు, చెట్లు ఎక్కదు, కానీ పులి నీటిలో కూడా తన ఆధిపత్యానికి ప్రదర్శిస్తుంది. ఎత్తైన చెట్లను అవలీలగా ఎక్కిస్తుంది. ఇలా అనేక తేడాలు ఉన్నాయ్.
విశాఖ జూ కు పులే రాజు
పులి, సింహాల మధ్య ఆ స్థాయిలో బేధాభిప్రాయాలు ఉన్నా విశాఖ జూ కి మాత్రం పులినే రాజుగా భావిస్తుంటారు. పెద్ద సంఖ్యలో సింహాలు కనపడక పోవడం, వాటి గురించి పూర్తి సమాచారం తెలియకపోవడం కారణం కావొచ్చు. కానీ విశాఖ జూలో మాత్రం అన్ని జంతువులు కంటే పులినే దర్జాగా ఉంటుంది. అంతటి రారాజు ఆయిన పులికి పుట్టే పిల్లలంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. దాన్ని సామంతు రాజుగా భావిస్తారు జూలో పనిచేసే వాళ్లంతా. చిన్నప్పటి నుంచి దానికి ఊహ తెలిసే వరకూ దానితోనే ఉండే జూ ఉద్యోగులతో అది సన్నిహితంగానే ఉంటుంది. అలాంటి బుజ్జి రాజు కు బర్త్ డే అంటే ఎలా ఉంటుందో తెలియజేసేదే ఈ స్టోరీ.
రాయల్ బెంగాల్ టైగర్‌కు ఐదేళ్లు
ఈ జూలోని రాయల్ బెంగాల్ టైగర్ (దుర్గ) ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా నిన్న విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరవ ఏట అడుగిడిన ఈ రాయల్ బెంగాల్ టైగర్ అంటే జూ క్యూరేటర్ డా. నందనీ సలారియాకి అమితమైన ఇష్టం. అందుకే సమీపంలో ఉన్న పాఠశాలల విద్యార్థులను పిలిపించి, కేక్ కట్ చేసి నిరంతరం దాని బాగోగులు చూసే సిబ్బంది మధ్య ఈ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా జూ క్యురేటర్, ఐఎఫ్ఎస్ అధికారిని నందనీ సలారియా టీవీ9 తో మాట్లాడుతూ వన్యప్రాణుల యెడల ప్రతీ ఒక్కరం ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. జూ లో అతిథిగా ఉన్న ఐదేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ దుర్గకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ఈ వేడుకలకు హాజరైన విద్యార్థులు, టీచర్లు, పర్యాటకులు, ఈ ఐదేళ్ళ టైగర్ దుర్గ దశాబ్దాల పాటు జూ సందర్శకులను అలరించాలని ఆశీర్వదించారు.
ఇలా అడవిలోని జంతువులను అత్యంత క్రూరంగా వేటాడుతూ ఉండే రాయల్ బెంగాల్ టైగర్ కు ప్రకృతిలో ప్రత్యేక స్థానం ఉంది. అడవులలో వాటి గాండ్రింపు వింటే అన్ని జంతువులు హడలిపోవాల్సిందే. మెరుపు వేగంతో జంతులను వేటాడగలిగే సత్తా దుర్గ సొంతం. దీని సంపూర్ణ జీవితం పర్యాటకులను అలరించాలని ఆకాంక్షిద్దాం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..