Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Fest: దీపావళి పండుగకు దూరంగా ఆ గ్రామం.. ఎందుకో తెలుసా..?

దీపావళి పండుగ అంటే వారం రోజులు ముందు నుంచే అంతట హడావుడి నెలకొంటుంది. టపాసులు, దీపపు ప్రమిదల కొనుగోల్లు, పిండి వంటల తయారీతో పల్లెల్లో పట్టణాల్లో ఒకటే సందడి. ఇక దీపావళి రోజు అయితే ఇళ్లల్లో పూజలు, సాయంత్రం దీపాలు,భోదెలు వెలిగించడం ఉంటాయి. టపాసుల శబ్దాలు, చ్చిచ్చిబుడ్డెలు, కాకరపువ్వొత్తుల జిలిబులి వెలుగులుతో అంతటా కాంతులీనుతు ఉంటుంది.

Diwali Fest: దీపావళి పండుగకు దూరంగా ఆ గ్రామం.. ఎందుకో తెలుసా..?
The Punnanapalem Villagers In Srikakulam Have Not Celebrate Diwali For 200 Years,
Follow us
S Srinivasa Rao

| Edited By: Srikar T

Updated on: Nov 12, 2023 | 10:10 PM

దీపావళి పండుగ అంటే వారం రోజులు ముందు నుంచే అంతట హడావుడి నెలకొంటుంది. టపాసులు, దీపపు ప్రమిదల కొనుగోల్లు, పిండి వంటల తయారీతో పల్లెల్లో పట్టణాల్లో ఒకటే సందడి. ఇక దీపావళి రోజు అయితే ఇళ్లల్లో పూజలు, సాయంత్రం దీపాలు,భోదెలు వెలిగించడం ఉంటాయి. టపాసుల శబ్దాలు, చ్చిచ్చిబుడ్డెలు, కాకరపువ్వొత్తుల జిలిబులి వెలుగులుతో అంతటా కాంతులీనుతు ఉంటుంది. చిన్నారులు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ ఎంజాయ్ చేసే పండుగ దీపావళి. అందుకే హిందువులు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఏడాదికి ఒక్కసారి వచ్చే దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామస్తులు మాత్రం దీపావళి పండుగకు నో చెబుతున్నారు. దీపావళితో పాటు నాగుల చవితి పూజలకు ప్రతియేటా దూరంగా ఉంటున్నారు ఈ గ్రామస్థులు. సుమారు 200 ఏళ్ల నుండి ఈ పండగలను చేసుకోవటం లేదట. దీనికి ఒక కారణం చెబుతున్నారు పున్నానపాలెం గ్రాస్తులు. దీపావళి రోజున నరకాసుర వధ జరిగి జగతికి వెలుగు వచ్చిన రోజుగా దీపావళిని జరుపుకుంటూ ఉంటే తమ గ్రామానికి మాత్రం ఆ రోజు చీకటిని నింపిందని చెబుతున్నారు ఆ గ్రామస్థులు.

గతంలో గ్రామములో దీపావళి రోజు ఊయలలో ఉన్న చిన్నారి పాము కాటుకు గురై చనిపోయిందట, అదే రోజు గ్రామంలో రెండు ఎడ్లు కూడా చనిపోయాయాయట. దీనిని గ్రామస్తులు అశుభంగా భావించి పండగకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పున్నానపాలేం గ్రామంలో పుట్టి పెరిగి బయట ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లిపోతే అక్కడ దీపావళి పండుగను అక్కడి వారి ఆచారం ప్రకారం జరుపుకుంటున్నారు. అలాగే బయట ఊరు ఆడపిల్ల పున్నాన పాలెం అబ్బాయిని వివాహం చేసుకునీ ఈ గ్రామానికి వస్తే మాత్రం నో దీపావళి.

ఇవి కూడా చదవండి

అయితే ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేసేవారు లేకపోలేదు. గ్రామంలో యువత, చదువుకున్న వాళ్ళు దీపావళి పండుగను చేసుకోవాలని పలు మార్లు సమావేశాలు జరిపి తమ వంతు ప్రయత్నం చేశారట. కానీ గ్రామ పెద్దలు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కాదని మళ్ళీ పండగను జరుపుకోవాలని చూడటం మంచిది కాదని ఏదైనా గ్రామానికి అశుభం జరిగే అవకాశం ఉండవచ్చని చెప్పటంతో భయపడి తిరిగి ఆ నిర్ణయాన్ని మనుకున్నారట. అంతేకాదు పున్నాన నరసింహులు నాయుడు అనే ఉపాధ్యాయుడు గతంలో పండుగ సెలబ్రేట్ చేసుకునే యత్నం చేయగా అతని కుమారుడు అకాల మరణం పొందాడట. దీంతో గ్రామస్తులు దీపావళి, నాగుల చవితి పండుగలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..