Forest Officers: నల్లమలలో వన్యమృగాలకు ప్రమాదం పొంచి ఉందా?
నల్లమల అడవి ప్రాంతంలో యదేచ్చగా వన్య ప్రాణి వేట కొనసాగుతుంది. ఫారెస్ట్ పోలీసులు వేటగాళ్ల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకుంటుండటంతో ఒక్కసారిగా నల్లమల అడవి ప్రాంతం ఉలిక్కిపడింది. నల్లమల అడవిలో జింకలను, దుప్పులను వేటాడి వాటి మాంసం 500 రూపాయలు చొప్పున అమ్మడమే వృత్తిగా చేసుకున్న కొందరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
నల్లమల అడవి ప్రాంతంలో యదేచ్చగా వన్య ప్రాణి వేట కొనసాగుతుంది. ఫారెస్ట్ పోలీసులు వేటగాళ్ల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకుంటుండటంతో ఒక్కసారిగా నల్లమల అడవి ప్రాంతం ఉలిక్కిపడింది. నల్లమల అడవిలో జింకలను, దుప్పులను వేటాడి వాటి మాంసం 500 రూపాయలు చొప్పున అమ్మడమే వృత్తిగా చేసుకున్న కొందరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వెలుగోడు అడవి ప్రాంతములో అడవి జంతువుల వేటకు వెళ్తున్న ఆరుగురు వేటగాళ్ళు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు నాటు తుపాకులు, నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ తుపాకులు కలిగి వుంటే కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాగభూషణంహెచ్చరించారు. వెలుగోడు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని గట్టు తాండ వద్ద అడివిలోకి నాటు తుపాకులతో వేటకు వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలని వారిపై చర్యలు తీసుకుని అవకాశం తక్కువగా ఉంటుందని సూచించారు.
అరెస్ట్ అయిన ఆరు మందిలో నేర చరిత్ర పరిశీలిస్తే అందరూ గతంలో నేరచరిత్ర కలిగిన వారిగా గుర్తించారు. పలు సంఘటనల్లో వీరిపై అనేక కేసులు నమోదు అయ్యాయని.. వీరులో కొందరు గంజాయి, మరికొందరు సారా, మరికొందరు చిన్న చిన్న అల్లర్లలో పాల్గొన్నప్పుడు నమోదైన కేసుల్లో ఉన్నారని వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..