Andhra Pradesh: కడపలో గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య.. తోటి స్నేహితుడే నిందితుడు

కడపలోని దారుణం చోటుచేసుకుంది. ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో గ్రామ వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. వాలంటీర్‌గా పనిచేస్తున్న భవానీశంకర్‌ (37) అనే వ్యక్తిని తోటి స్నేహితుడే దారుణంగా హతమార్చాడు. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 14వ డివిజన్‌లో భవానీశంకర్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వాలంటీర్‌గా పనిచేయడమే కాకుండా కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో..

Andhra Pradesh: కడపలో గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య.. తోటి స్నేహితుడే నిందితుడు
Volunteer Murdered In Kadapa
Follow us

|

Updated on: Nov 12, 2023 | 3:35 PM

కడప, నవంబర్‌ 12: కడపలోని దారుణం చోటుచేసుకుంది. ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో గ్రామ వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. వాలంటీర్‌గా పనిచేస్తున్న భవానీశంకర్‌ (37) అనే వ్యక్తిని తోటి స్నేహితుడే దారుణంగా హతమార్చాడు. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 14వ డివిజన్‌లో భవానీశంకర్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వాలంటీర్‌గా పనిచేయడమే కాకుండా కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో డిజిటలైజేషన్‌ విభాగంలోనూ అతను విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే కార్యాలయంలో మల్లికార్జున్‌ అనే తోటి ఉద్యోగస్తుడు భవానీ శంకర్‌కు మంచి స్నేహితుడు. అయితే ఇటీవల ఓ మహిళ విషయమై వీరిద్దరికీ గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలో భవానీ శంకర్‌ను హత్య చేసేందుకు మల్లికార్జున్‌ పథకం పన్నాడు. దీంతో భవానీ శంకర్‌కు మల్లికార్జున్‌ ఫోన్‌ చేసి ఉదయం 9 గంటలకు ఎల్‌ఐసీ కార్యాలయానికి రావల్సిందిగా కోరాడు. అక్కడికి భవానీ శంకర్‌ చేరుకోగానే అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో భవానీ శంకర్‌ మెడపై దాడి చేశాడు. దీంతె అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మల్లికార్జున్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న కడప డీఎస్పీ షరీఫ్‌ హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మరో అమానుష ఘటన: దళిత చిన్నారిపై ఎస్సై అత్యాచారం.. చితకబాదిన స్థానికులు

అభంశుభం తెలియని నాలుగేళ్ల దళిత బాలికపై ఓ ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎస్సైగా పనిచేస్తున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌ను ఈ దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఈ దారుణం జరుగగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని సస్పెండ్‌ చేసి, అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. నిందితుడిని రహువాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. చిన్నారికి తినుబండారాల ఆశజూపి తన గదిలోకి తీసుకెళ్లి ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటికి పొక్కడంతో స్థానికులు ఆగ్రహంతో పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టి నిందితుణ్ని చితక్కొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి