Prakasam District: చేపల వేటకు వెళ్లిన జాలరికి కలిసొచ్చిన అనుకోని లక్..

పోతన్నకు బంగారు నాణేలు దొరికాయని తెలుసుకున్న సహచర మత్స్కకారులు నది ఒడ్డున నాణేల కోసం జల్లెడ పట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికారు... తమకు కూడా బంగారు నాణేలు దొరుకుతాయన్న ఆశంతో చేపల వేట మానేసి గాలించారు. అయితే వీరి ఆశ తీరలేదు... మిగిలిన వారికి బంగారు నాణేలు దొరకలేదు.

Prakasam District: చేపల వేటకు వెళ్లిన జాలరికి కలిసొచ్చిన అనుకోని లక్..
Gold Coins
Follow us
Fairoz Baig

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:02 PM

చేపల వేటకు వెళ్ళిన జాలరికి అనుకోని అదృష్టం కలిసివచ్చింది. చేపలు పడుతున్న సమయంలో నది ఒడ్డున ఐదు బంగారు నాణేలు దొరికాయి. దీంతో ఆ జాలరి సంబరపడిపోయాడు… ఇంటికి వచ్చి తనకు బంగారునాణేలు దొరికాయంటూ అందరికీ చూపించాడు. ఇప్పుడు అదే అతని కొంప ముంచేలా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీలోని చెంచు పునరావాస కాలనీలో నివసించే కుడుముల పోతన్న అనే వ్యక్తికి ఐదు పురాతన బంగారపు నాణేలు దొరికాయి. పదిహేను రోజుల క్రితం పాలంక సమీపంలోని కృష్ణా నదికి కొంత మందితో కలిసి చేపల వేటకు వెళ్ళాడు పోతన్న. నదిలో చేపలు పడుతున్న సమయంలో ఒడ్డున మిలమిల మెరుస్తున్నట్టు కనపడటంతో వెళ్లి చూసి.. వాటిని రంగురాళ్ళుగా భావించాడు. దగ్గరకు వచ్చి చూస్తే అతని కళ్లు జిగేలుమన్నాయి. ఎందుకంటే అవి రంగురాళ్ళు కాదు… బంగారు నాణేలు… ఒకే చోట ఐదు బంగారు నాణేలు కనిపించడంతో చుట్టుపక్కల అంతా వెతికాడు… అయితే ఐదు నాణేలు తప్ప మరేమీ లభించలేదు.

పోతన్నకు బంగారు నాణేలు దొరికాయని తెలుసుకున్న సహచర మత్స్కకారులు నది ఒడ్డున నాణేల కోసం జల్లెడ పట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికారు… తమకు కూడా బంగారు నాణేలు దొరుకుతాయన్న ఆశంతో చేపల వేట మానేసి గాలించారు. అయితే వీరి ఆశ తీరలేదు… మిగిలిన వారికి బంగారు నాణేలు దొరకలేదు. తనకు దొరికిన ఐదు బంగారు నాణేలు తీసుకుని ఇంటికి వచ్చిన పోతన్న వాటిని గ్రామస్తులకు చూపించాడు. తనకు బంగారు నాణేలు దొరికాయని సంబర పడ్డాడు… ఈ నాణేలపై అర్ధంకాని రీతిలో రాసిన అక్షరాలు ఉన్నాయి… అలాగే నాణేలపై ఓ వ్యక్తి ముఖాకృతి ఉంది… దీన్ని బట్టి ఈ నాణేలు రాజుల కాలంలోనివిగా భావిస్తున్నారు… దీంతో ఈ నాణేల గురించి అధికారులు తెలుసుకుని వాటిని తీసుకువెళతారని పోతన్న భయపడుతున్నాడు… పేదరికంలో ఉన్న తమ కుటుంబానికి ఈ బంగారు నాణేలు ఆసరాగా ఉంటాయని, వాటిని తీసుకెళ్ళడానికి అధికారులు రావద్దంటూ వేడుకుంటున్నాడు… దొరికిన ఈ ఐదు నాణేములతో తాము కోటీశ్వరులము కామని, తమ కుటుంబాన్ని అధికారులు వేధించవద్దని అమాయకంగా కోరుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..