Gold Mines: కరువు సీమలో పసిడి పంట.. బంగారం వెలికితీత పనుల ముమ్మరం
జొన్నగిరి.. పగిడిరాయి గ్రామాల మధ్య పెద్ద ఎత్తున పసిడి నిపేక్షాలు ఉన్నట్లు 1992 లో అప్పటి భూగర్భ పరిశోధన శాఖ డైరెక్టర్ జయరామి రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. GSI సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ రామారావు తో పాటు సిబ్బంది. భూమిలో ఉన్న బంగారు నిపేక్షాలు పోరలను ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనేందుకు భూమిలోపల యంత్రాలతో పరిశీలిస్తూ పనులు ముమ్మరం చేశారు. పసిడి గనులు ఉన్నాయని ఒక అంచనాకు వచ్చారు.
రాయలసీమ, నవంబర్ 13: కరువు సీమలో పంటల సంగతేమో కానీ బంగారం మాత్రం పండుతోంది. కిలోమీటర్ల కొద్దీ భూమి పొరల్లో దాగివున్న పచ్చని బంగారాన్ని వెలికి తీస్తున్నారు. ఇది వినడానికి చూడటానికి నమ్మశక్యం కాకపోయినప్పటికీ పచ్చి నిజం. బంగారం కోసం ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం బంగారం బయటకు తీస్తున్నారు. మీరు నమ్మాలంటే అక్కడికి స్వయంగా వెళ్లి బంగారు తవ్వకాలను పరిశీలించవచ్చు
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు..
రాయలసీమ కరువు కటకాలకు ప్రసిద్ధి. అలాంటి కరువు నేలలో పసిడి పంట పండుతుంది. ఆ పసిడి పంట కోసం దాదాపు 50 ఏళ్లుగా భూగర్భ పరిశోధనశాఖ తీవ్ర అన్వేషణ చేసింది. చివరికి కరవు నేలలో బంగారు పండుతుందని తేల్చారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి, బొల్లావానిపల్లి, రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 1550 ఎకరాల లో యస్(S) ఆకారంలో బంగారు నిపేక్షాలకోసం 1985 నుంచి 1990 వరకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భూగర్భ పరిశోధన శాఖ అధికారులు వివిధ రకాల అన్వేషణ చేశారు. అందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జొన్నగిరి ప్రాంతంలో భూగర్భ పరిశోధన అధికారులు పెద్ద పెద్ద యంత్రాల సహాయం తో భూమిలో డ్రిల్లింగ్ పనులు చేపట్టారు.
GSI డైరెక్టర్ జయరామ్ రెడ్డి నేతృత్వంలో పనులు వేగవంతం..
జొన్నగిరి.. పగిడిరాయి గ్రామాల మధ్య పెద్ద ఎత్తున పసిడి నిపేక్షాలు ఉన్నట్లు 1992 లో అప్పటి భూగర్భ పరిశోధన శాఖ డైరెక్టర్ జయరామి రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. GSI సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ రామారావు తో పాటు సిబ్బంది. భూమిలో ఉన్న బంగారు నిపేక్షాలు పోరలను ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనేందుకు భూమిలోపల యంత్రాలతో పరిశీలిస్తూ పనులు ముమ్మరం చేశారు. పసిడి గనులు ఉన్నాయని ఒక అంచనాకు వచ్చారు. భూగర్భ పరిశోధన శాఖ అధికారులు కూడా పగిడిరాయి జొన్నగిరి గ్రామాల మధ్య బంగారు గనులు సొరంగాలు ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు..
అప్పట్లో అదనపు కలెక్టర్ స్మిత సబర్మల్ పనుల పరిశీలన
పసిడి గనులు ఉన్నట్లు అప్పట్లో GSI శాఖ అధికారులు గుర్తించారు.. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్పట్లో ఉన్న కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ స్మిత సబర్మల్ డ్రిల్లింగ్ పనులు పరిశీలించారు. అక్కడి ప్రజల కూడా త్వరలో బంగారు తవ్వకాలు జరిగితే కాలుష్య నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలో.. స్థానికుల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయం పై అవగాహన సదస్సు లు నిర్వహించారు.
ఎక్కువ ఖర్చు అంటూ పక్కకు తప్పుకున్న GSI..
GSI జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2002 లో బంగారు వెలికితీత పనులు చేపట్టాలని ఒక అంచనా వేశారు. వివిధ రకాల ఇబ్బందులతో గనుల తవ్వకాలు జరపలేదు. భూముల కొనుగోలు యంత్రాల ఉపయోగం తవ్వకాల్లో సిబ్బంది నియామకం తదితర విషయాలపై సమగ్రమైన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకొని వెళ్ళింది GSI. బంగారు తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది.. తవ్వకాల్లో బయట పడే బంగారుకు కేంద్ర ప్రభుత్వం పెట్టె పెట్టుబడి సరిపోతుందని GSI డైరెక్టర్లు తేల్చారు.
జోయో మైసూర్ కంపనీ తవ్వకాలకు ముందుకు..
జియో మైసూర్ కంపనీ వారు గతంలో GSI శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పగిడిరాయి జొన్నగిరి గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల కోసం 10 ఏళ్లుగా పరిశోధన చేశారు.. చివరికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చులతో బంగారు వెలికితీత పనులు వేగవంతం చేసారు.
భూముల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం..
బంగారు వెలికితీత పనుల భాగంగా కొందరు రైతుల భూములు కొనుగోలుకు జియో మైసూర్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు వేగవంతం చేసిన తమకు నష్ట పరిహారం చెల్లించడం లేదని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..