Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: వృద్ధ దంపతుల దోచుకోవాలనుకున్నారు.. బొమ్మ తుపాకులతో బెదిరించారు.. తీరా చూస్తే షాక్..

వృద్ధ దంపతులను బెదిరించడానికి ఓ చెక్క తుపాకీ, ఇనుప చాకులు సిద్ధం చేసుకుని దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే పోలీసు విచారణలో ఆ ఇంటి సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.. సీసీ  ఫుటేజ్ ఆధారంగా పోలీసులను నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.. అంతేకాకుండా ఇంటికి రక్షణగా బాబురావు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడంతో వీరి పథకం పారలేదు.

West Godavari: వృద్ధ దంపతుల దోచుకోవాలనుకున్నారు.. బొమ్మ తుపాకులతో బెదిరించారు.. తీరా చూస్తే షాక్..
West Godavari
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Nov 13, 2023 | 10:16 AM

చెక్క తుపాకీతో బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ఇంటికి రక్షణగా వారు చేసుకున్న ఏర్పాట్లే దొంగతనం జరగకుండా కాపాడాయి. అంతేకాకుండా దొంగలను పట్టించడానికి అవి సహాయ పడ్డాయి. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇంట్లో దొంగతనానికి యత్నించిన నలుగురు అంతర్రాష్ట్ర నిందుతులను అరెస్టు చేశారు. ప్రతి ఇంట్లో ప్రస్తుతం అలాంటి రక్షణ ఏర్పాట్లను చేసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. త్వరలో దొంగతనం నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ప్రత్యేక క్యాంపెయిన్ చేపడతామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

తణుకు మండలం వేల్పూరు బాలాజీ నగర్ లో వృద్ధ దంపతులైన బండా బాబురావు అతని భార్య జీవిస్తున్నారు. ఈనెల 8వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో బాబురావు ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దాంతో ఇంటికి ఎవరో వచ్చారు అనుకుని బాబురావు ఇంటి తలుపులు తెరిచాడు. ఇంటి బయట చేతిలో చెక్క తుపాకీ చాకుతో ముగ్గురు వ్యక్తులు బాబురావును బెదిరిస్తూ ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే ఆయన వారిని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో బాబురావు చేతికి తమ వెంట తెచ్చుకున్న కత్తి తగిలి రక్తపు గాయమైంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాబురావు భార్య పెద్దగా కేకలు వేయడంతో వారి ప్రయత్నం ఫలించక అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న తణుకు రూరల్ పోస్టులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేసు దర్యాప్తులో పోలీసులకు ఆ ఇంటి సీసీ ఫుటేజ్ ఎంతో కీలకంగా మారింది. తణుకు మండలం దువ్వలో ఓ ఫర్నిచర్ షాప్ ఉంది. షాపు యజమాని ఉత్తరప్రదేశ్ కు చెందిన వర్కర్లను తీసుకువచ్చి షాపులో మంచాలు, కుర్చీలు ఇతరత్రా సామాగ్రి వారితో తయారు చేయించి తన షాపులో అమ్ముతాడు. ఆ షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి కొంతకాలం క్రితం బాబురావు ఇంట్లో ఫర్నిచర్ వర్క్ చేశాడు. అలాగే ఇటీవల అదే షాప్ లో పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా ఫర్నిచర్ పాలిష్ పనుల నిమిత్తం బాబురావు ఇంటికి వెళ్ళాడు. అయితే వీరిద్దరూ ఇంట్లో ఇద్దరు వృద్ధులు మాత్రమే ఉంటున్నారని గమనించి, ఆ ఇంట్లో విలువైన వస్తువులు దొంగిలించాలని పథకం రచించారు. దొంగతనానికి తాము వస్తే గుర్తుపట్టేస్తారని భయంతో అదే షాపులో పనిచేస్తున్న తమ స్నేహితులైన మరో ముగ్గురిని దొంగతనం చేసినందుకు సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

వృద్ధ దంపతులను బెదిరించడానికి ఓ చెక్క తుపాకీ, ఇనుప చాకులు సిద్ధం చేసుకుని దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే పోలీసు విచారణలో ఆ ఇంటి సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.. సీసీ  ఫుటేజ్ ఆధారంగా పోలీసులను నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.. అంతేకాకుండా ఇంటికి రక్షణగా బాబురావు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడంతో వీరి పథకం పారలేదు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితులైన మహమ్మద్ సాదిక్, ఉస్మాన్, షాహి ఆలం, మహమ్మద్ హర్షద్ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా దోపిడీకి యత్నించిన వారిలో మరో మైనర్ దొంగ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన బొమ్మ తుపాకీ, రెండు చాకులు, ఓ తాడుని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ప్రజలందరూ తమ ఇంటికి రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తాడేపల్లిగూడెం డీఎస్పి శరత్ రాజ్ కుమార్ సూచించారు.

సీసీ కెమెరాలు ఇంటికి రక్షణగా పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, అలాగే కుటుంబంలో సహా ఏదైనా ఊరు వెళ్లిన సందర్భాల్లో తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించవచ్చని, త్వరలోనే సీసీ కెమెరాల వినియోగంపై ప్రజలకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తామని, ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ నిత్యవసర వస్తువు లాగా ఎంత అవసరమో అదే విధంగా ఇంటికి రక్షణగా సీసీ కెమెరాలు అంతే అవసరమని డి.ఎస్.పి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..