Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch cctv Footage: టెంపుల్ సిటీలో చెడ్డీగ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి దాటాకా శ్రీవారి విల్లాస్‌లో దూరి..

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కదలికలపై పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొందరు వ్యక్తులు చెడ్డీలు ధరించి కర్రలు కత్తులు పట్టుకొని సంచరిస్తున్నట్లు గుర్తించారు. నగర శివారులోని ఇళ్లను చెడ్డి గ్యాంగ్ టార్గెట్ చేస్తోందని చెప్పారు. ఉదయం పూట రెక్కీ నిర్వహించడం రాత్రి సమయంలో చోరీకి పాల్పడుతుంటారని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల మధ్యలోనే చెడ్డి గ్యాంగ్ ఆపరేషన్ మొదలవుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Watch cctv Footage: టెంపుల్ సిటీలో చెడ్డీగ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి దాటాకా శ్రీవారి విల్లాస్‌లో దూరి..
Cheddi Gang Hulchul In Tiru
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 13, 2023 | 12:14 PM

తిరుపతి, నవంబర్13;  ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరవాసుల్లో చెడ్డీ గ్యాంగ్ టెన్షన్ వెంటాడుతోంది. గత 3 రోజుల క్రితం ఆటో నగర్ లోని మారుతి షో రూంలో చోరీ కి ప్రయత్నించింది ఈ గ్యాంగ్‌. అక్కడేమి దొరక్కపోవడంతో వెళ్లిపోయిన ముఠా..రెండ్రోజుల క్రితం శ్రీవారి విల్లాస్‌లో చోరికి ప్రయత్నించింది. తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి దగ్గర ఉన్న శ్రీవారి విల్లాస్ నెంబర్ 31 లోకి అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ ముఠా చొరబడింది. ఇంట్లో నగదు, బంగారం ఏమి దొరకక పోవడంతో వెనుదిరింది. చెడ్డీ గ్యాంగ్ నగర శివార్లోని ఇళ్లను టార్గెట్ చేస్తోంది. పగటి సమయంలో రెక్కి నిర్వహించి, రాత్రి సమయంలో చోరీలకు ప్రయత్నిస్తోందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్న తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలంటోంది. ఎవరైనా తలుపుకొట్టినా, కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం వస్తే తొందరపడి డోర్‌ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, చెడ్డీగ్యాంగ్‌ గా భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇళ్లల్లోకి చొరబడి దోపిడీలకు పాల్పడే అత్యంత ప్రమాదకరమై చెడ్డి గ్యాంగ్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడులకు తెగబడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది. నగర శివారు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. చెడ్డి గ్యాంగ్ ఫింగర్ ప్రింట్స్ ను సేకరించిన జిల్లా పోలీస్ అండ్ రంగం రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పలుచోట్ల దొంగ తనాలకు పాల్పడిన చెడ్డీగ్యాంగ్ గా ఇదేనని భావిస్తోంది. ఈ మేరకు చెడ్డి గ్యాంగ్ ఆచూకీ కనుక్కునే పనిలో ఉన్నామంటున్నారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కదలికలపై పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. తిరుపతిలోకి చెడ్డీగ్యాంగ్ ప్రవేశించినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఆటోనగర్, చెర్లోపల్లి ప్రాంతాల్లో రెండు చోట్ల చెడ్డిగ్యాంగ్ చోరీలకు ప్రయత్నించిందని వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొందరు వ్యక్తులు చెడ్డీ ధరించి కర్రలు కత్తులు పట్టుకొని సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. నగర శివారులోని ఇళ్లను చెడ్డి గ్యాంగ్ టార్గెట్ చేస్తోందని చెప్పారు. ఉదయం పూట రెక్కీ నిర్వహించడం రాత్రి సమయంలో చోరీకి ప్రయత్నించడం జరుగుతుందన్నారు. అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల మధ్యలోనే చెడ్డి గ్యాంగ్ ఆపరేషన్ మొదలవుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల అప్రమత్తంగా ఉండి అనుమానితులుగా భావిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

పోలీస్‌ యంత్రాంగం మొత్తం చెడ్డిగ్యాంగ్ కదలికలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు. పెట్రోలింగ్ పెంచి నిఘా కట్టుదిట్టం చేశామని చెప్పారు. చెడ్డి గ్యాంగ్ కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగిన చోరీలకు పాల్పడిన వారిగా అనుమానిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆనవాళ్లు కూడా సరిపోతున్నాయని, చెడ్డి గ్యాంగ్ లోని ముగ్గురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నట్టు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ ఇచ్చేసిన పృథ్వీరాజ్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ ఇచ్చేసిన పృథ్వీరాజ్
ఒక్కసినిమాతో భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీ!
ఒక్కసినిమాతో భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీ!
వేద పాఠశాల సమీపాన నిర్మానుష్య ప్రదేశం.. అదో మాదిరి శబ్దాల
వేద పాఠశాల సమీపాన నిర్మానుష్య ప్రదేశం.. అదో మాదిరి శబ్దాల
స్టైలిష్ లుక్‌లో అంజలి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
స్టైలిష్ లుక్‌లో అంజలి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
మేడం అయితే.. సార్ ఫోన్ చేశారేంటి..? అనుమానంతో ఆరా తీయగా..
మేడం అయితే.. సార్ ఫోన్ చేశారేంటి..? అనుమానంతో ఆరా తీయగా..
ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!
ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!
చిన్న పొదుపే తారక మంత్రం.. డబ్బు రాబడిని ఇలా పెంచుకోండి
చిన్న పొదుపే తారక మంత్రం.. డబ్బు రాబడిని ఇలా పెంచుకోండి
UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్...
UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్...
రాధికకు క్రేజీ బాయ్‌ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!
రాధికకు క్రేజీ బాయ్‌ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!
ఐపీఎల్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌!
ఐపీఎల్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌!