26 ఏళ్ల యువకుడు.. అభినవ కుంభకర్ణుడు..! నిద్రపోతే ఇక లేవడు..వారం రోజుల తర్వాత..
గతంలోనూ రాజస్ధాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అతడు కూడా ఇలానే రోజుల తరబడి నిద్రపోతుంటాడు. అతడిని మేల్కొల్పేందుకు కుటుంబంసభ్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం మహారాష్ట్రలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. అతను మేల్కోవాలని మనస్సులో అనుకున్నప్పటికీ అతని శరీరం..
26 ఏళ్ల యువకుడు వరుసగా ఎనిమిది రోజులు నిద్రపోయాడు. అతడి అసాధారణ నిద్రావస్థను చూసిన కుటుంబీకులు ఆందోళనపడిపోయారు. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విచిత్ర సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఎనిమిది రోజుల నిద్రలో అతను కేవలం తినడానికి, వాష్‌రూమ్ వెళ్లటం వంటి ప్రాథమిక కార్యకలాపాలు నిర్వహించడానికి కొన్ని సార్లు మాత్రమే లేచాడు. అది కూడా సెమీ కాన్షియస్ స్థితిలో. యువకుడికి క్లీన్-లెవిన్ సిండ్రోమ్ (కెఎల్ఎస్) ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. యువకుడి ఆరోగ్య స్థితిపై వోకార్డ్ హాస్పిటల్‌లోని న్యూరాలజిస్ట్ డా. ప్రశాంత్ మఖిజా వివరణ ఇచ్చారు. KLS ఒక సంక్లిష్ట వ్యాధి. ఈ వ్యాధికి గల ఖచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యాధి చాలా అరుదు అని కూడా వైద్యులు వెల్లడించారు. యువకుడి అసాధారణ నిద్రను గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక వైద్యులు, మంత్రగత్తెలను సంప్రదించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు అదే నిద్రను కొనసాగిస్తూ వస్తుండటంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. తన కెరీర్‌లో ఇది మూడో కేసు అని, పదేళ్ల క్రితం రెండు కేసులున్నాయని డాక్టర్ చెప్పారు. ఈ వ్యాధికి స్పష్టమైన కారణం లేదు. కారణం వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చునని అంటున్నారు. అతను మేల్కోవాలని మనస్సులో అనుకుని నిద్రకు ఉపక్రమించినప్పటికీ అతని శరీరం నిద్రలేచేందుకు సహకరించదు. అలా వారు రోజులతరబడి నిద్రావస్థలోనే ఉండిపోతారని చెప్పారు.
KLSని నిర్ధారించడానికి నిర్దిష్ట పరీక్షలు లేవు. న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ చకోర్ మాట్లాడుతూ 12 నుంచి 25 ఏళ్లలోపు టీనేజర్లు, యువకుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. వైద్యులు ఈ వ్యాధిని ‘కుంభకర్ణ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. అయితే, ప్రపంచంలో అత్యంత కొద్ది మందిలో మాత్రమే ఈ అరుదైన వ్యాధి కనిపిస్తుంది. ఇలాంటి వారికి సరైన చికిత్స అవసరం..చికిత్స సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఇకపోతే, గతంలోనూ రాజస్ధాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అతడు కూడా ఇలానే రోజుల తరబడి నిద్రపోతుంటాడు. అతడిని మేల్కొల్పేందుకు కుటుంబంసభ్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం మహారాష్ట్రలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స, వ్యాధి కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..