‘ఉల్లి’ కొనుక్కుని డబ్బులిచ్చి పారిపోయిన మహిళ.. తీరా ఆ నోట్ చెక్ చేయగా..
ఉల్లిపాయలు కొనటానికి వెళ్లి ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఎంత పెద్ద దొంగైనా చిన్న పొరపాటుతో దొరక్క తప్పదు. తాజాగా విజయవాడలో కుడా ఓ ఉల్లిపాయ వ్యాపారి నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశాడు. ఏదో ఊరికే ఉల్లిపాయలు తీసుకోవటానికి వెళ్లిన ఓ మహిళ.. అక్కడి నుంచే నేరుగా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.
ఉల్లిపాయలు కొనటానికి వెళ్లి ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఎంత పెద్ద దొంగైనా చిన్న పొరపాటుతో దొరక్క తప్పదు. తాజాగా విజయవాడలో కుడా ఓ ఉల్లిపాయ వ్యాపారి నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశాడు. ఏదో ఊరికే ఉల్లిపాయలు తీసుకోవటానికి వెళ్లిన ఓ మహిళ.. అక్కడి నుంచే నేరుగా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తూ.. వెళ్తూ.. తనతో పాటు తప్పుడు పనుల్లో తోడున్న తోటి మిత్రులను కూడా వెంట తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరరావు మార్కెట్‌లో ఎప్పటిలానే ఉల్లిపాయలు అమ్ముకునే ఓ వ్యాపారి వద్దకు వనజాక్షి అనే మహిళ.. ‘ఉల్లి’ని కొనేందుకు వచ్చింది. కొనుగోలు అనంతరం నకిలీ వంద నోటు ఇచ్చి గమ్మున వెళ్లిపోయింది. ఇచ్చిన నోట్ నకిలీదిగా గుర్తించినా.. ఆ వ్యాపారి సైలెంట్‌గా ఉండి.. మొత్తం విషయాన్ని పోలిసులకు అందించాడు. అంతే సంగతులు! రంగంలోకి దిగిన పోలీసులు తిగ లాగితే డొంక కదిలినట్లు ఏకంగా నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠానే అరెస్ట్ అయింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన షేక్ బాజీ నకిలీ నోట్లు తయారీ చేస్తాడు. ఆ నకిలీ నోట్లను అతడి పార్ట్‌నర్స్ అయిన ఇడుపుగల్లుకు చెందిన షేక్ షకీరా, పెనమలూరు మండలం హుజూర్‌నగర్‌కు చెందిన షేక్ మీరవల్లి, గొల్లపూడికి చెందిన తాతినేని వనజాక్షి చలామణి చేస్తుంటారు. ఎప్పటి నుంచో క్రైమ్ పార్ట్‌నర్లుగా ఉన్న వీళ్లు కొద్ది మొత్తంలో నకిలీ నోట్లను ప్రింట్ చేసి.. వాటితో పాటు కొన్ని ఒరిజినల్ నోట్లను కలిపి బయట చలామణి చేస్తున్నారు.
పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే తనిఖీలు చేయగా.. ఒరిజినల్ నోట్లను ఒకదాని పక్కన ఒకటి పెట్టి ట్రాన్స్‌ఫర్ స్టిక్కర్‌ల ద్వారా అంటించి ప్రింట్ తీశారని ఖాకీలు గుర్తించారు. ఈ మెరుపు దాడిలో 33,040 నకిలీ కరెన్సీ, 21 ,500 ఒరిజినల్ డబ్బులను సీజ్ చేశారు పోలీసులు. పోలిసుల విచారణలో షేక్ బాజీ 100, 50 నోట్లు ఇస్తాడని వనజాక్షి తెలిపింది. ఆమె చెప్పిన సమాచారంతో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. సొంత అవసరాల కోసం మార్కెట్‌లో అక్కడక్కడా జిరాక్స్ తీసిన నోట్లను కలిపి చలామణి చేస్తున్నట్లుగా తేల్చారు.