AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ.. అలెర్ట్.. ఇలా కూడా ఉంటారు.. 5 రూపాయలు పంపమని రూ.లక్ష కొట్టేశాడు!

ఎస్బీఐ నుంచి ఆ మహిళకు కాల్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ. లక్ష బదిలీ అయ్యాయి. మీరే చేశారా? అని ప్రశ్నించారు బ్యాంక్‌ సిబ్బంది. తాను చేయలేదని ఆమె సమాధానం ఇచ్చింది. తీరా బ్యాంకు స్టేట్‌మెంట్‌ పరిశీలిస్తే.. తన ఖాతా నుంచి రూ. లక్ష డెబిట్ అయినట్లు చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే సైబర్ క్రైమ్ నంబరుకు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేసి పోలీసులను ఆశ్రయించింది.

బీ.. అలెర్ట్.. ఇలా కూడా ఉంటారు.. 5 రూపాయలు పంపమని రూ.లక్ష కొట్టేశాడు!
Cyber Crime
M Sivakumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 13, 2023 | 11:20 AM

Share

మనం ఆన్ లైన్ లో తెలిసీ తెలియకచేసే తప్పులు చివరకు తిప్పలు తెస్తున్నాయి. మన కష్టాన్ని మోసగాళ్లు దోచుకునేందుకు ఇవి అవకాశం ఇస్తున్నాయి… బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు రోజు రోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. మన సమాచారాన్ని పంచుకుంటే తీరని నష్టం జరగక మానదు.. ఇటీవల విజయవాడలో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం..

విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఓ మహిళకు పదేళ్ల నుంచి పాస్ పోర్టు ఉంది. చిరునామా మార్చి రెన్యువల్ చేసుకునేందుకు గత నెలలో విజయవాడలోని పాస్ పోర్ట్ కేంద్రంలో దరఖాస్తు చేశారు. సిద్ధమైన తర్వాత పోస్టులో ఇంటికి పంపిస్తామని అధికారులు చెప్పారు… అంతరం కొన్ని రోజులకు పోస్టల్ శాఖ నుంచి ఆమెకు ఎస్ఎంఎస్ వచ్చింది. రిజిస్టర్డ్ పోస్టులో కవర్ డిస్పాచ్ అయిందని అందులో ఉంది. మూడు రోజులు చూసినా కవర్ రాలేదు. దీంతో ఆమె ఆన్లైన్లోకి వెళ్లి పోస్టల్ శాఖను సంప్రదించేందుకు నంబరు కోసం వెతికారు… అందులో కనిపించిన ఓ సైట్లో తన సమస్యను నమోదు చేశారు. ఈ నెల 3న ఓ నంబరు నుంచి కాల్ వచ్చింది. మీ చిరునామా సరిగా లేదని, మార్చాల్సి ఉందన్నాడు. అందుకే రిజిస్టర్డ్ పోస్టు ఆలస్యమవుతోందని నమ్మించాడు..

సమస్య పరిష్కారం కావాలంటే పోస్టల్ శాఖకు రూ.5 యూపీఐ ద్వారా చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. దీని కోసం ఓ లింక్ పంపిస్తున్నట్లు చెప్పి దానిని 15 సెకన్లలో ఓ నంబరుకు పంపించమని చెప్పాడు. ఆ వ్యక్తి పంపించిన లింక్‌ను చెప్పిన సమయంలోగా పంపించేందుకు 14 సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 15వ సారి పంపించగలిగింది. తర్వాత యూపీఐ ద్వారా రూ.5 చెల్లించింది. మరుసటి రోజే ఆమెకు పోస్టులో పాస్‌పోర్టు వచ్చింది. రూ.5 చెల్లించడం వల్లే వచ్చిందని ఆమె భావించారు.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐ నుంచి ఆ మహిళకు కాల్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ. లక్ష బదిలీ అయ్యాయి. మీరే చేశారా? అని ప్రశ్నించారు బ్యాంక్‌ సిబ్బంది. తాను చేయలేదని ఆమె సమాధానం ఇచ్చింది. తీరా బ్యాంకు స్టేట్‌మెంట్‌ పరిశీలిస్తే.. తన ఖాతా నుంచి రూ. లక్ష డెబిట్ అయినట్లు చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే సైబర్ క్రైమ్ నంబరుకు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేసి పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..