- Telugu News Photo Gallery Jaishankar couple visit britain prime minister rishi sunak gave special gift to kyoko jaishankar on the occasion of diwali
Diwali 2023: బ్రిటన్‌లో పర్యటిస్తున్న జైశంకర్ దంపతులు.. దీపావళి కానుకగా ప్రధాని రిషికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన జైశంకర్
దీపావళి పండగను దేశ విదేశాలోని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా తమ బంధు మిత్రులకు, సన్నిహితులకు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు భారత కేంద్ర మంత్రి జైశంకర్ ప్రత్యేక బహుమతిని అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయన భార్య క్యోకో జైశంకర్ బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి జై శంకర్ దంపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కి జైశంకర్ ప్రత్యేక బహుమతిని అందించారు.
Updated on: Nov 13, 2023 | 12:28 PM

ప్రధాని రిషి సునక్ అక్షతా మూర్తి దంపతులు జై శంకర్ దంపతులు ఒకరికొకరు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అంతే కాదు భారతదేశ ప్రధాని మోడీ తరపున ఎస్.జైశంకర్ బ్రిటన్ ప్రధానికి అభినందనలు తెలిపారు.

ఎస్ జైశంకర్‌తో పాటు ఆయన భార్య క్యోకో జైశంకర్ లు రిషి సునక్ దంపతులు ఆదివారం (నవంబర్ 12) డౌనింగ్ స్ట్రీట్‌లో సమావేశమయ్యారు.

దీపావళి రోజున బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు మంత్రి జై శంకర్. భారతదేశం, UK సమకాలీన కాలానికి సంబంధించిన బంధాన్ని పునర్నిర్మించడంలో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. రిషి సునక్ , అతని భార్య అక్షతా మూర్తి కలిసి జై శంకర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు.

జైశంకర్ తన భార్య క్యోకో జైశంకర్ తో కలిసి రిషి సునక్‌కి క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను, గణేశ విగ్రహాన్ని బహుకరించారు. ఈ విషయాన్ని జైశంకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

జైశంకర్ ఆదివారం బ్రిటీష్ యుకె కౌంటర్ జేమ్స్ ని సందర్శించారు. ఆయన శనివారం బ్రిటన్ వెళ్లారు. నవంబర్ 15 వరకు యూకే పర్యటనలో ఉండనున్నారు.

దీంతో పాటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న సంక్షోభంపై ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద చర్యలను కూడా ఇద్దరు నేతలు ఖండించారు.

భారతదేశం, బ్రిటన్ దేశాలు అనేక సమస్యలపై కలిసి పనిచేస్తున్నాయి. పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆర్ధిక, స్వేచ్ఛా వాణిజ్యంపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.





























