Andhra Pradesh: అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన ఆందోళనకారులు.. పోలీసుల లాఠీచార్జ్..
అమరావతి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అమరలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు యత్నించారు. దాంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. బారీకేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే, ఆ బారికేడ్లను తొలగించేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు.. బస్సుపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో.. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు నంబూరి శంకరరావుకి మద్ధతుగా భారీగా రోడ్లపైకి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. కొమ్మాలపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇలా ఇరు పార్టీల రగడతో అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..