AP News: యాక్సిడెంట్ అయిన లారీని చెక్ చేసిన పోలీసులు.. లోపల ఉన్నది చూసి షాక్
మత్తుగాళ్లు రెచ్చిపోతున్నారు. గంజాయి స్మగ్లింగ్ రోజుకో కొత్త టెక్నిక్ వాడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గంజాయి బోర్డర్ దాటించి తామేదో రియల్ లైఫ్ పుష్పా అని ఫీలవుతున్నారు. ఈ కేటుగాళ్లకి సరైన చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.
ఏపీలో గంజాయి రవాణాకు అడ్డు కట్ట పడటం లేదు. చాటు మాటుగా యవ్వారం సాగిస్తున్నారు కేటుగాళ్లు. కొత్త కొత్త ఐడియాలతో సరుకును బార్డర్లు దాటించేస్తున్నారు. పోలీసులు, సెబ్, నార్కోటిక్ బ్యూరో.. విసృత తనిఖీలు చేస్తున్నప్పటికీ.. మత్తుగాళ్లు లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అనకాపల్లి జిల్లా రేగుపాలెం చెక్‌పోస్టు వద్ద భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
లారీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న సుమారు 1,100 కేజీల గంజాయిని హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తుని వైపు వస్తున్న ఆ లారీని శుక్రవారం రాత్రి రేగుపాలెం చెక్‌పోస్టు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. లారీని రోడ్డు పక్కన నిలిపివేశారు. అప్పటికే పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది అక్కడికి చేరుకుని.. లారీని తనిఖీ చేసి.. సుమారు 1,100 కేజీల గంజాయి ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి.. తదుపరి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..