Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Backlog Jobs: నెల్లూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ గ్రూప్‌ 4 కింద.. నెల్లూరులోని దివ్యాంగులకు 10 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. టైపిస్ట్, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్-3, కుక్ తదితర..

Nellore Backlog Jobs: నెల్లూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Nellore Backlog Recruitment 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2023 | 11:53 AM

ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ గ్రూప్‌ 4 కింద.. నెల్లూరులోని దివ్యాంగులకు 10 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. టైపిస్ట్, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్-3, కుక్, కామాటి, పీహెచ్‌ వర్కర్, ఫిట్టర్ కూలీ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, సీఎల్‌ఐఎస్సీ, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 18, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • టైపిస్ట్ పోస్టులు: 1
  • లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులు: 2
  • కుక్ పోస్టులు: 1
  • కామాటి పోస్టులు: 3
  • పీహెచ్‌ వర్కర్ పోస్టులు: 2
  • ఫిట్టర్ కూలీ పోస్టులు: 1

అడ్రస్..

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, నెల్లూరు, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.