టీడీపీ కార్యకర్త కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ.. రిమాండ్ రిపోర్ట్ రిజక్ట్.. ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్..
యూట్యూబర్ కమ్ టీడీపీ కార్యకర్త వెంగళరావు కేసు ఏపీలో హీట్ పుట్టించింది. రాజకీయ ప్రకంపనలు రేపిన ఈ కేసులో సీఐడీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ, కోర్టు ఏం చెప్పింది? అసలేం జరిగింది?
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావు కేసులో ఏపీ సీఐడీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడ్డాడంటూ వెంగళరావును సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రైమరీ ఇంటరాగేషన్ తర్వాత పోలీసులు గుంటూరు సీఐడీ కోర్టులో వెంగళరావును హాజరుపర్చారు. అయితే, సీఐడీకి ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. వెంగళరావు రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి రిజక్ట్ చేశారు. సెక్షన్ 41-A కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోన్న వెంగళరావును సీఐడీ అధికారులు అక్రమ కేసులో ఇరికించారని అతని తరపు న్యాయవాది వాదించారు.
సీఐడీ పోలీసులు తనను కొట్టారని, ఇబ్బందులకు గురిచేశారని న్యాయమూర్తి ముందు వెంగళరావు తన గోడు చెప్పుకున్నారు. దాంతో, సీఐడీ పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. అదే సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వెంగళరావును విడుదల చేయాలని ఆదేశించారు. తనను అర్ధరాత్రి అరెస్ట్‌చేసి, శారీరకంగా, మానసికంగా వేధించారని అన్నారు. సీఐడీ పోలీసులు తీరు అత్యంత దుర్మార్గం ఉందని వెంగళరావు వాపోయాడు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని వెంగళరావు తెలిపాడు. చంద్రబాబు, లోకేష్ పేర్లు చెబితే వదిలేస్తామని అన్నారని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులా? అణచిచేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని అంటున్నారని పేర్నొన్నాడు. టోటల్‌గా వెంగళరావు కేసులో ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించింది.