AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggayyapeta: జగ్గయ్యపేట వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఊహించని షాక్‌

Jaggayyapeta: జగ్గయ్యపేట వైసీపీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఊహించని షాక్‌ తగిలింది. రెండు దశాబ్దాలుగా సామినేని వెంట నడుస్తోన్న ముఖ్య అనుచరుడు..

Jaggayyapeta: జగ్గయ్యపేట వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఊహించని షాక్‌
Mla Samineni Udaya Bhanu
Subhash Goud
|

Updated on: Aug 28, 2022 | 8:20 AM

Share

Jaggayyapeta: జగ్గయ్యపేట వైసీపీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఊహించని షాక్‌ తగిలింది. రెండు దశాబ్దాలుగా సామినేని వెంట నడుస్తోన్న ముఖ్య అనుచరుడు పదవులకు రాజీనామా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకొచ్చి మూడేళ్లు దాటిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకుపైగా టైముంది. అయితే ఇన్నాళ్లూ బయటపడని అసంతృప్తులు, విభేదాలు, అసమ్మతి ఇప్పుడు సెగలు రేపుతున్నాయ్‌. అనేక నియోజకవర్గాల్లో వర్గపోరు మంటలు పుట్టిస్తున్నాయ్‌. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట వైసీపీలో ముసలం బయటపడింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రయాణం చేస్తోన్న చౌడవరపు జగదీశ్, పార్టీ పదవులకు, జగ్గయ్యపేట కోఆప్షన్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

చౌడవరపు జగదీశ్ నిర్ణయంతో జగ్గయ్యపేట వైసీపీలో కలకలం రేగింది. జగ్గయ్యపేట పట్టణ వైసీపీ అధ్యక్ష పదవికి, మున్సిపల్ కోఆప్షన్‌ పదవికి ఒకేసారి రాజీనామా ప్రకటించడంతో వైసీపీ లీడర్స్‌ కంగుతిన్నారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలంటూ జగదీశ్‌ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, జగ్గయ్యపేట వైసీపీలో జరుగుతోన్న పరిణామాలతో తాను మనస్తాపం చెందానంటున్నారు చౌడవరపు జగదీశ్. జగ్గయ్యపేట వైసీపీలో అనేక కోటరీలు నడుస్తున్నాయని, అందులో ఇమడలేకే పదవులకు రాజీనామా చేశానన్నారు. అలాగే, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తనను బాధించాయన్నారు జగదీశ్‌. అయితే, తాను కేవలం పదవులకు మాత్రమే రాజీనామా చేశా, కానీ వైసీపీ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. సీఎం జగన్‌ అండ్‌ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అభిమానిగా కంటిన్యూ అవుతానంటున్నారు చౌడవరపు జగదీశ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి