Viral Fever: వామ్మో జ్వరాలు.. నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న వైరల్‌ ఫీవర్స్‌.. రోగులతో హాస్పిటల్స్‌ ఫుల్‌..

Viral Fever: మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు, వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న మార్పులు వెరసి నల్లగొండ జిల్లాల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పల్లెలు..

Viral Fever: వామ్మో జ్వరాలు.. నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న వైరల్‌ ఫీవర్స్‌.. రోగులతో హాస్పిటల్స్‌ ఫుల్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 28, 2022 | 8:15 AM

Viral Fever: మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు, వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న మార్పులు వెరసి నల్లగొండ జిల్లాల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పల్లెలు విష జ్వరాలతో పడకేస్తున్నాయి. ఇంట్లో కనీసం ఒకరు లేదా ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పది రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయింది.

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 300 నుంచి 350 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 600కు పైగా చేరుకుంది. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యాదాద్రి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో ఓపిల్లో 120 నుంచి 150 మంది పేషెంట్లు వచ్చేవారు. గత పది రోజుల నుంచి ఆ సంఖ్య 250 నుంచి 300 వరకు పెరిగింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రులు కూడా విష జ్వరాలతో పాటు, సాధారణ జ్వర పిడితులతో కిక్కిరిసి పోతున్నాయి. వారం రోజులుగా జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో అల్లాడు తున్నామని బాధితులు వాపోతున్నారు.

అధికారులపై వెల్లువెత్తుతోన్న ఆరోపణలు..

ఇదిలా ఉంటే వైద్య ఆరోగ్యశాఖ జ్వరాల వివరాలను నమోదు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ భారీ వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమల నివారణకు మందుల పిచికారి, పాగింగ్ లాంటి చర్యలు తూతూ మాత్రంగా చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పైపులైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమవడంతోనే రోగాలు వ్యాపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?