Chandrababu: పోలీసుల మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయి.. కుట్ర రాజకీయాలతో హింసను ప్రేరేపిస్తున్నారు.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
కుప్పం ఘటనలో ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టులను ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులు పదుల...
కుప్పం ఘటనలో ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టులను ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులు పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చెయ్యడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా తప్పు పట్టారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఆరుగురిని అరెస్టు చెయ్యడాన్ని చంద్రబాబు ఖండించారు. తన పర్యటనలో పాల్గొన్న 60 మందిపై తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ఠ అని చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ పై, టిడిపి నేతలపై దాడి చేసిన వైసిపి గూండాలను వదిలి పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఏం న్యాయం అని పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ (TDP) నేతలపై దాడి జరిగితే వారిపైనే హత్యాయత్నం కింద కేసులు పెట్టడంపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల మద్దతుతోనే స్థానికంగా దాడులు జరిగాయని, తప్పు చేసిన పోలీసు అధికారులకు శిక్షలు పడేవరకు వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ కుట్ర రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి టిడిపి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయాలను ప్రేరేపిస్తున్న వైసీపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలీసుల సహాయంతో కుప్పంలో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని ఆపేస్తున్నారు. కుప్పం చరిత్రలో నిన్న జరిగింది చీకటి రోజు. నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నాం. కుప్పంపై వైసీపీ నేతలకు ఎందుకంత కోపం. అన్న క్యాంటీన్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు. సదుద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం తమిళనాడులో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ ను సీఎం స్టాలిన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నేను పులివెందులను అభివృద్ధి చేసి, గండికోట నుంచి నీళ్లిచ్చాను. కానీ వైసీపీ పాలనలో మాత్రం కుప్పం పై రాజకీయంగా కక్ష గట్టారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. అన్న క్యాంటీన్ వద్ద ఎందుకు ఏర్పాటు చేయలేదు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి బయట తరిగే వాడా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..