Andhra Pradesh: విజయవాడలో విదేశీ గ్యాంగ్ హల్‌చల్.. వారి లక్ష్యం అదొక్కటే..
Andhra Pradesh: బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి గ్యాంగ్‌లు, పీకలు కోసే హంతక ముఠాలు, తాజాగా బెజవాడ క్రైమ్ డైరీలో కొత్త అలజడి రేగింది.
Andhra Pradesh: బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి గ్యాంగ్‌లు, పీకలు కోసే హంతక ముఠాలు, తాజాగా బెజవాడ క్రైమ్ డైరీలో కొత్త అలజడి రేగింది. విజయవాలో విదేశీ గ్యాంగ్‌లు రచ్చ చేశారు. బెడవాడ అడ్డగా బంగ్లాదేశ్ ముఠాల ఆగడాలు మరింత పెరిగాయి. ఏటీఎంలే టార్గెట్‌గా సీరియల్ చోరీలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా ఈ అంతర్జాతీయ ముఠాకు చెక్ పెట్టారు పోలీసు. దీనికి సంబంధించిన చోరీలకు సంబంధించి
అక్రమంగా డబ్బు కొల్లగొట్టేందుకు దేశం కాని దేశానికి వచ్చింది ఓ దొంగల ముఠా. ఏటీఎం కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎం కేంద్రాలపై ముందస్తుగా రెక్కీ నిర్వహించి.. పక్కా ప్లాన్‌తో చోరీలకు తెగబడుతున్నారు. అయితే, వీరి ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. వారి ప్లాన్‌కు చెక్ పెట్టి.. కటకటాల్లోకి పంపారు మన పోలీసులు.
చోరీలకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సైమన్ గ్యాంగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఆ ముఠాతో కత అట్లుంటది. ఉపాధి కోసం వలస పక్షుల్లా రావడం.. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో వాలడం. పొద్దంతా గల్లీ గల్లీ తిరిగి సెక్యూరిటీ లూప్ హోల్స్ వున్న ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేస్తారు. కుదిరితే దొంగ తాళం చెవులతో ఖేల్ ఖతమ్ అనిపిస్తారు. స్పాట్‌లో మిషన్‌ను బ్రేక్ చేసి క్యాష్ ఎత్తుకెళ్తారు. లేదంటే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళ్తారు. శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తీరగ్గా మిషన్‌ను పగుల కొట్టి క్యాష్‌తో ఉడాయిస్తారు. సైమన్ ట్రైనింగ్ అలా వుంటది మరి.
విజయవాడ సహా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఏటీఎంల్లో చోరీ కేసులు జోరందుకున్నాయి. దీంతో పోలీసులు పక్కా నిఘా పెట్టారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎంక్వయిరీలో బంగ్లాదేశ్‌కు చెందిన సైమన్ గ్యాంగ్ ఆగడాలతో విస్తుపోయే నిజాలు తెరపైకి వచ్చాయి. ఈ ముఠా ఉపాధి పేరిట భారత్‌లోకి వస్తుంది. దేశమంతా తిరుగుతారు. అందులో భాగంగా విజయవాడలో వాలారు. బెజవాడ బస్టాండ్‌నే అడ్డాగా చేసుకున్నారు. చోరీకి కావాల్సిన సరంజామాను కూడా ఇక్కడే కొనడం సహా బస్టాండ్‌లోనే భద్రపరిచారు. పొద్దంతా టార్గెట్ సెర్చింగ్.. నైటంతా బస్లాండ్‌లో మకాం. గడియారంలో గంట 12 కొట్టగానే ఆపరేషన్ చోరీ షురూ. ఆటోలో షికారు చేస్తూ టార్గెట్ చేసిన ఏటీఎం సెంటర్ దగ్గరకు వెళ్లారు. సీసీ టీవీ, అలారం పనిచేయకుండా వైర్లు కట్ చేస్తారు. ఆ తరువాత ఏటీఎంను కొల్లగొడతారు. ఇలా దోచుకున్న డబ్బుతో మళ్లీ బంగ్లాదేశ్‌కు పరారవుతారు. ఇదీ వీళ్ల యవ్వారం.
అయితే, విజయవాడ సహా కృష్ణా జిల్లాలో పలు ఏటీఎంలను లూటీ చేసింది ఈ ముఠా. తిన్నదరిగే వరకు.. చోరీ సొమ్ముతో జల్సాలు చేసి మళ్లీ హంటింగ్‌లో భాగంగా బెజవాడలో వాలారు. కిస్మత్ ఎప్పుడూ ఒకవైపేసాథ్ ఇవ్వదు కదా. ఈసారి ఖాకీలది అప్పర్ హ్యాండయింది. ఆరుగురు సభ్యుల బంగ్లాదేశ్ ముఠా అడ్డంగా బుక్కాయింది. లక్షకు పైగా నగదుతో పాటు చోరీ సరంజామాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాపై పలు రాష్ట్రాల్లో కేసులున్నట్టు దర్యాప్తులో తేలింది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు విజయవాడ పోలీసులు.
బంగ్లాదేశ్ బ్యాచ్ ఇలా చిక్కిందో లేదో అలా మరో ఇన్సిడెంట్ తళుక్కుమంది. కొత్తపేట బ్రాహ్మణ వీధిలోని ఓ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. సెక్యూరిటీ గార్డ్ పసిగట్టి వాళ్లను బంధించే ప్రయత్నం చేశాడు. కానీ దొంగలు తుర్రుమన్నారు. ఇలా ఓవైపు ఇళ్లను లూటీ చేస్తూ.. మరోవైపు ఏటీఎంలనే కొల్లగొడుతున్న ఘటనలు చూసి జనాలు భయపడిపోతున్నారు.
ఇదిలాఉంటే.. జీతాలు ఖర్చు ఎందుకని బ్యాంకులు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడం వల్లే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌లు సైతం ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తపేటలో ఏటీఎం సెంటర్‌లో సెక్యూరిటీ గార్డ్ వుండడం వల్ల దొంగల పప్పులుడకలేదు. లేదంటే అక్కడా ఎటీఎం లూటీ జరిగివుండేది. ఇక నైనా బ్యాంకులు ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం వుందంటున్నారు పబ్లిక్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..