Telugu News Trending Video of grandfather and grandchildren has gone viral on social media Telugu Viral News
Viral Video: 42 ఏళ్ల తర్వాత తాత కోరిక తీర్చిన మనవడు.. నెట్టింట వీడియో వైరల్
సాధారణంగా ఊళ్లల్లో ఉండే పెద్దవాళ్లు తమ గ్రామ పరిధిలోనే పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. వారి పిల్లలు జీనోపాధి కోసం నగరాలకు వెళ్లి, అక్కడే స్థిరపడితే ఇక గ్రామంలో పెద్దవాళ్లు ఒంటరిగా ఉండిపోవాల్సిందే. పండుగలు, పర్వదినాల్లో...
సాధారణంగా ఊళ్లల్లో ఉండే పెద్దవాళ్లు తమ గ్రామ పరిధిలోనే పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. వారి పిల్లలు జీనోపాధి కోసం నగరాలకు వెళ్లి, అక్కడే స్థిరపడితే ఇక గ్రామంలో పెద్దవాళ్లు ఒంటరిగా ఉండిపోవాల్సిందే. పండుగలు, పర్వదినాల్లో కొడుకులు, కూతుళ్లు ఇంటికి వస్తే ఆ ఆనందమే వేరు. అయితే కొన్ని సార్లు పెద్దవాళ్లు కూడా నగరాలకు వస్తుంటారు. అలా వచ్చిన సమయంలో వారు నగరంలో ఉండే సౌకర్యాలు, సాంకేతికత, ఆధునికత వంటివి చూసి ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అలాంటిదే. పెద్దవాళ్లు తమ మనవళ్లు, మనవరాళ్లను ప్రేమతో చూసుకుంటారు. వారితో ఆడిపాడుతూ సంతోషంగా కాలం గడుపుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన తాతను సినిమాకు తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వారి అన్యోన్యతకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 42 ఏళ్లుగా సినిమా థియేటర్ ముఖమే చూడని తాతయ్య.. తన మనవడి కోరిక కాదనలేక సినిమాకు వెళ్లాడు.
ఈ వీడియోను డాక్టర్ దీపక్ అంజ్నా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో సంప్రదాయ దుస్తులు ధరించిన పెద్దాయన ఎస్కలేటర్‌పై వెళుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత తాతా మనవళ్లు సినిమా చూసేందుకు థియేటర్ లోపలికి వెళ్లారు. 42 ఏళ్ల తర్వాత థియేటర్‌కు వచ్చిన పెద్దాయన థియేటర్ పరిసరాలను చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు. మీరు మీ తాతతో మూవీకి వెళుతుంటారు..మా తాత చివరిసారిగా 1980లో థియేటర్‌కు వెళ్లారని ఈ వీడియోకు టెక్ట్స్‌ను జోడించారు. ఈ వీడియోను లక్షలమంది నెటిజన్లు చూశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.