IND vs PAK: పాక్‌తో పోరులో భారత్ విజయం పక్కా.. కోహ్లీ లెక్కలే ఇందుకు సాక్ష్యం.. కెరీర్‌లోనూ వెరీ స్పెషల్ మ్యాచ్..
ఈ ప్రత్యేక సందర్భంలో విరాట్ కోహ్లి అద్భుతంగా రాణించి, టీమిండియాను గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ 100వ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా అదృష్టంగా మారనుందా, అంటే రికార్డులు చూస్తే, అవుననే సమాధానమే వస్తుంది.

Virat Kohli
ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. టీమిండియా దిగ్గజ ఆటగాడు ఆదివారం తన 100వ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రత్యేక సందర్భంలో విరాట్ కోహ్లి అద్భుతంగా రాణించి, టీమిండియాను గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ 100వ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా అదృష్టంగా మారనుందా, అంటే రికార్డులు చూస్తే, అవుననే సమాధానమే వస్తుంది. అదేంటో తెలుసుకుందాం..
- నిజానికి విరాట్ కోహ్లి 100వ మ్యాచ్ లేదా ఇన్నింగ్స్ ఆడినప్పుడల్లా భారత్‌కు విజయం మాత్రమే దక్కింది. విరాట్ తన 100వ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు, అతని బ్యాట్ నుంచి 13 పరుగులు వచ్చాయి. భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- శ్రీలంకపై 100వ టెస్టులో విరాట్ 45 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- విరాట్ కోహ్లీ 2013లో వెస్టిండీస్‌తో వన్డేల్లో 100వ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 22 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
- విరాట్ కోహ్లీ తన 100వ వన్డే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 43 పరుగులు చేయడంతో భారత్ 5 పరుగుల తేడాతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి

Asia Cup 2022: 6 జట్లు.. 13 మ్యాచ్‌లు.. 15 రోజులు.. నేటి నుంచే ఆసియా కప్.. చరిత్ర నుంచి షెడ్యూల్ వరకు.. పూర్తి వివరాలు ఇవే..

పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ. 299తో రూ. 10 లక్షల కవరేజీ.. పూర్తి వివరాలు ఇవే..

Asia Cup 2022: ఈ 5గురి పైనే అందరి దృష్టి.. లిస్టులో భారత స్టార్ ప్లేయర్..

Virat Kohli: 7+18 భాగస్వామ్యాలు ఎప్పటికీ ప్రత్యేకమే.. ఆసక్తిరేపుతోన్న కోహ్లీ పోస్ట్.. అర్థమేంటో తెలుసా?